BigTV English

Indian Politics : కేసీఆర్‌తో చేతులు కలిపితే ఇంటి దారి పట్టాల్సిందేనా? బాధితుల జాబితే పెద్దదే!

Indian Politics : కేసీఆర్‌తో చేతులు కలిపితే ఇంటి దారి పట్టాల్సిందేనా? బాధితుల జాబితే పెద్దదే!

Indian Politics : తెలంగాణ రాజకీయాల్లో ఎంతో సాధించా.. ఇక దిల్లీ గడ్డపై నుంచి దేశానికి దిశానిర్దేశం చేస్తానంటూ.. సరికొత్త జెండా, అజెండాతో దేశ పర్యటన చేశారు ఆ నేత. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్ని కలిసి చర్చించారు. అంతా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టి కలబడదామంటూ ఉపన్యాసాలు దంచికొట్టారు. ఇంకేముంది.. దేశాధినేతను నేను, నా పరివారంగా మీరుండండి అంటూ ఓ విమానం కొనుక్కుని అన్ని రాష్ట్రాలు చుట్టేశారు. అదేంటో కానీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే ఈ తెలంగాణ పెద్దమనిషి ఒటమిని చవిచూడగా.. ఆయనతో షేక్ హ్యాండిచ్చి, కలిసి నడుద్దామనుకున్న ప్రతీ నాయకుడు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్నారు. ఇది విచిత్రమో, అనూహ్యమో తెలియదు కానీ.. రాజకీయ సమరంలో ఆ పెద్దమనిషి కనుమరుగు కాగా, ఆయనకు సపోర్టర్లుగా ఉండాలని కోరిన వాళ్లంతా కూడా అదే బాటలో నడస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయం ఇప్పుడు పొలిటికల్ ఆసక్తికరంగా మారింది. దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కేటీఆర్ ట్వీట్ కు  వ్యతిరేకంగా.. కాంగ్రెస్ ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేస్తోంది.


తెలంగాణలో అధికారాన్ని చూసుకుని దేశానికి నేతగా ఎదగాలనుకున్న కేసీఆర్.. ఎన్నో ప్రణాళికల్ని వివరించారు. ఆ పార్టీ పేరుగా ఉన్న తెలంగాణ అనే పదాన్ని సైతం తొలగించే సాహసం చేశారు. ప్రజల సెంటిమెంట్ గా ఉన్న తెలంగాణల పేరు స్థానంలో దేశంలో విస్తరించే పార్టీ అంటూ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన కేసీఆర్ దేశ టూర్.. పీక్స్ లోకి చేరుకుంది. ఓ దశలో ఏకంగా దేశ రాజ్యాంగాన్నే మార్చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించడంతో పాటు అక్కడి నేతల్ని పార్టీలో బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. కండుపాలు కప్పి అరచేతిలో అధికారాన్ని చూపించారు. కానీ.. రెండేళ్లు తిరగకుండానే సొంత రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయారు. దాంతో.. దేశ్ కి నేత టూర్.. మధ్యలోనే ముగిసిపోయింది.

సీఎం హోదాలో సరికొత్త జట్టు కడదామంటూ దేశంలో తిరిగిన కేసీఅర్.. “బీజేపీ ముక్త్ భారత్” మన లక్ష్యం అంటూ ప్రకటించారు. మహారాష్ట్ర, ఒడిశా, బిహార్, దిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టారు. ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ లతో సహా.. ఏపీ అప్పటి సీఎం గా ఉన్న చంద్రబాబు, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను కలుసుకున్నారు. రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు అంటూ ప్రకటించారు. అయితే… సరిగ్గా మూడేళ్లు తిరిగే సరికి.. ప్రకటన చేసిన నేత అచూకీ రాష్ట్రంలో కనిపించకుండా పోతే.. మిగతా రాష్ట్రాల్లో ఆయన దోస్తీ కడదామనుకున్న నాయకుల పరిస్థితి కూడా అదే తీరుగా తయారైంది.


తాజాగా జరిగిన దిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఘోర ఓటమి చవిచూశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పదేళ్లకు పైగా అధికారం చెలాయించిన నేత.. మిగతా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని ప్రయత్నిస్తున్న దశలో ఓటమి పాలయ్యారు. తన సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ ఇమేజ్ తనను గెలిపిస్తాయనుకున్న చోట.. ఓటమి ఆహ్వానం పలికింది. కేసీఆర్ దోస్తి జాబితాలో చివరి వికెట్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతదే. కాగా.. అతని కంటే ముందు అనేక మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ ఠాక్రే సైతం ఒకానొక దశలో కేసీఆర్ తో చేతులు కలిపి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ.. అనూహ్యంగా.. తన పార్టీ శివసేన రెండుగా చీలిపోయింది. అసలు పార్టీ పేరు, గుర్తు తన ప్రత్యర్థి చేతికి చిక్కగా.. రెండు దఫాలు అధికారాన్ని కోల్పోయాడు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌ను కలిశారని గుర్తు చేసుకుంటున్నారు.. కొందరు రాజకీయ పరిశీలకులు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం చాలా బలహీన స్థితిలో ఉంది.

ఇక.. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తిరుగులేని రాజకీయ నేత. అనేక పర్యాయాలుగా వరుస విజయాలతో పార్టీని, రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు. తమ బిజు జనతా దళను ఒరిస్సాలో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా మలిచారు. అలాంటి నేత కేసీఆర్ తో ఒకానొక దశలో రాజకీయ చర్చలు చేశారు. జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని చూశారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములతో సంబంధం లేకుండా సరికొత్త కూటమి కట్టాలనుకున్నారు. ఇప్పుడు.. వీరిద్దరూ అధికారానికి దూరం అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఏపీలో జగన్ గెలుపు కోసం కేసీఆర్.. ప్రచార వాహానాల నుంచి అనేక తీరులుగా సపోర్టు చేశారనే ఆరోపణలున్నాయి. పైగా.. అనేక వ్యూహ రచనలు, ఇతర సహాయ సహకారాలు అందించారని చెబుతుంటారు. ఒకరికొకరు.. చాలా బలంగా ఎన్నికల్లో సపోర్టుగా నిలవాలని నిర్ణయించున్న వ్యక్తులు. అలాంటి నేత.. కేసీఆర్ ని ఇంటికి పిలిచి బిర్యాని తిరిపించి పంపించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఘోరమైన పతనాన్ని చూశారు. కేవలం 11 సీట్లకు పరిమితమై.. ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయారు.

Also Read : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఈసీ బ్రేక్

ఇలా… ఈ జాబితాలో అనేక మంతి రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వారంతా కేసీఆర్ తో రాజకీయ వేదికల్ని పంచుకోవడం, జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలనుకున్న వ్యక్తులే కావడం యాథృచ్చికమో.. ఇంకా ఏదైనా కారణం ఉందో అంటూ అనుమానంగా చెబుతున్నారు. కొందరు సోషల్ మీడియా మీమర్స్ సైతం అదే తీరుగా.. కామెంట్లు, మీమ్స్ వదులుతున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×