BigTV English

Marri Janardhan Reddy : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీకి మర్రి జనార్థన్ గుడ్ బై?

Marri Janardhan Reddy : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీకి మర్రి జనార్థన్ గుడ్ బై?

marri janardhan reddy


Marri Janardhan Reddy : గులాబీ రేకులు రాలిపోతున్నాయి. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు మర్రి జనార్ధన్ రెడ్డి. పార్లమెంట్ టికెట్‌ ఆశిస్తూ కాంగ్రెస్‌ పార్టీతో మంతనాలు జరుపుతున్నారు. టికెట్‌ కన్ఫర్మ్ అయితే హస్తం గూటికి చేరి.. పార్లమెంట్‌ బరిలో ఉండనున్నారు మర్రి జనార్దన్‌రెడ్డి. ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలతో.. నాగర్‌కర్నూలు జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో పడ్డారు. శుక్రవారం అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 87,161 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపి టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎంపి టికెట్ కష్టమేనని భావిస్తున్న నేపథ్యంలో.. పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×