BigTV English

Marwadi Controversy: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?

Marwadi Controversy: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?

Marwadi Controversy: గో బ్యాక్ మార్వాడీ. ఇదీ తెలంగాణలో రెయిజ్ అవుతున్న స్లోగన్. ఎలా మొదలైంది.. ఎందుకు మొదలైందో కరెక్ట్ గా తెలియదు. అయినా సరే స్లోగన్ ఊపందుకుంది. మార్వాడీల పెత్తనం ఎక్కువైందని, కనీసం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని, చిన్న పట్టణాల్లో విస్తరించి స్థానిక వ్యాపారుల పొట్ట కొడుతున్నారని, ఇలా రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయ్. మరి ఏది నిజం? ఏం జరుగుతోంది?


గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం చుట్టూ గరంగరం

తెలంగాణలో ఒక్కసారిగా మార్వాడీల చుట్టూ గరంగరం వాతావరణం పెరిగింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండువైపులా టైట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సంఘటితంగా ఉందాం.. సమస్యలను ఎదుర్కొందాం అని మార్వాడీ కమ్యూనిటీ రెడీగా ఉంది. ఇటు చూస్తే తెలంగాణ వాదుల్లో కొందరు గో బ్యాక్ మార్వాడీస్ అంటూ నిరసన పెంచుతున్నారు. మొన్నామధ్య తెలంగాణ వ్యక్తికి, మార్వాడీ లీడర్ కు జరిగిన ఫోన్ సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.


నిజాం కాలం నుంచే ఇక్కడికి రాక..

ఈ ఇష్యూ ఇంతలా హీటెక్కడానికి కారణాలేంటో చూద్దాం. ఎవరి వెర్షన్ ఎలా ఉందో కూడా డీకోడ్ చేద్దాం. లోకల్, నాన్ లోకల్ అన్నంత దాకా సీన్ వెళ్లడానికి కారణాలు చూద్దాం. నిజానికి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ ఇష్యూ ఎలా మొదలైందో గానీ.. దీనికి త్వరగా చెక్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సబ్జెక్ట్ ఇవాళ్టిది కాదు. మార్వాడీల బిజినెస్ కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలం నుంచే రాజస్థాన్, గుజరాత్ ల నుంచి ఇక్కడికి రాక మొదలైంది. తెలంగాణే కాదు.. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా సౌత్ ఇండియాలోని పట్టణాలు, నగరాల్లోని ప్రతి గల్లీలో వీరికి సంబంధించి ఏదో ఒక షాప్ కచ్చితంగా ఉండి తీరుతుంది. వందల ఏళ్ల నుంచే ఇక్కడికి మార్వాడీల రాక మొదలైంది. రాజస్థాన్ లో కరువు కాటకాలు ఎక్కువ. అక్కడ సరైన వ్యాపార వృద్ధి లేక ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అటు గుజరాతీల రాక కూడా పెరిగింది.

మర్వాడీ కమ్మూనిటీ అందరిపపై నిందలా?

మన దేశ రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా బతకొచ్చు.. ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు. బిజినెస్ లు చేసుకోవచ్చు. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. అయితే ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరగడంతో తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుందంటున్నారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. మ్యాటర్ ఎక్కడిదాకా వెళ్లిందంటే మార్వాడీల బిజినెస్ లతో స్థానిక వ్యాపారుల బిజినెస్ లు దెబ్బతింటున్నాయన్న దాకా. సో ఇది రెండువైపులా సెన్సిటివ్ టైమ్. ఎందుకంటే ఎవరు ఎక్కువ మాట్లాడినా సమస్యలు పెరుగుతాయ్. తెలంగాణలో గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం.. ఒక ఇష్యూ నుంచి మరో ఇష్యూకు షిఫ్ట్ అయింది. ఎవరో ఒకరు అవమానించారని చెప్పి మొత్తం మార్వాడీ కమ్యూనిటీపై నిందలు వేయడం ఎంత వరకు కరెక్ట్ అన్న వెర్షన్ ను మరికొందరు వినిపిస్తున్నారు. రైట్ ఇప్పుడు అభ్యంతరాలేంటో చూద్దాం. పాత తరం మార్వాడీలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న కొత్త తరం.. చిన్న చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నారని, ప్రతి బిజినెస్ లో వీళ్లదే ఆధిపత్యం ఉండేలా చూసుకుంటున్నారన్న వాదనను వినిపిస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా మంది మాట్లాడారు. పెద్ద పెట్టుబడుల ధాటికి తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణలోని స్థానిక చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారికి భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారాయన.

చిన్న పట్టణాల్లో తెలంగాణేతర వ్యక్తుల కట్డడి సాధ్యమా?

ఆహార ఉత్పత్తులు, సరుకుల కల్తీ దందాలో 97 శాతం మార్వాడీలే ఉన్నారని మరికొందరు ఆరోపించారు. తెలంగాణ పండగల స్ఫూర్తిని మార్వాడీలు దెబ్బతీస్తున్నారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. ఆభరణాల తయారీలో మార్వాడీలు మోసపూరితంగా వ్యవహరిస్తారని తెలంగాణ విశ్వకర్మ ప్రతినిధి తన వాదన వినిపించారు. ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో తెలంగాణేతర వ్యక్తుల వ్యాపారాలను అనుమతించకుండా ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి డిమాండ్‌ చేశారు. మార్వాడీలు ఇచ్చే చందాల కోసమే రాజకీయ పార్టీల నేతలు వాళ్ల దారుణాలపై పల్లెత్తు మాట అనడం లేదని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి విమర్శించారు. కాగా, తెలంగాణలో స్థానికుల వ్యాపారాల రక్షణ కోసం, తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా ప్రభుత్వం చట్టాలు తేవాలని సదస్సులో తీర్మానించారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి సంస్థలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధన తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఫైనల్ గా గుజరాత్‌, రాజస్థాన్‌ వ్యాపారుల వద్ద కొనుగోళ్లు చేయవద్దని పిలుపునిచ్చారు.

అన్ని రకాల వ్యాపారాల్లో మార్వాడీలు

సో ఈ మ్యాటర్ ఎక్కడికి ముడిపడిందంటే.. తెలంగాణవాసుల వ్యాపారం, వృత్తికి పెద్దసంక్షోభం వచ్చిందంటూనే.. ఇక్కడే బతుకుతూ తెలంగాణ బతుకమ్మ, బోనాలు, ఇతర సంస్కృతి సంప్రదాయాలంటే పట్టింపు లేకుండా అవమానకరంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ వరకూ వెళ్లింది. సమస్యకు మరో కోణం ఇప్పుడు చూద్దాం. భారత్ లో ఎవరికైనా, ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్న వాదనను మార్వాడీలు వినిపిస్తున్నారు. తాము ఎవరి అవకాశాలనూ దెబ్బతీయట్లేదంటున్నారు. మరోవైపు వీరికి బీజేపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారు. పెట్టుబడులు తెస్తున్నారంటున్నారు. ఇంతకీ మార్వాడీల బలం ఏంటి? వారి విజయ రహస్యమేంటి? ఈ ఇష్యూ మతం రంగు పులుముకుందా?

హోల్ సేల్ టూ రిటైల్ అంతా వారి చేతుల్లోనే..

మార్వాడీ వ్యాపారులు భారత్ లో సక్సెస్ ఫుల్ గ్రూప్ గా పేరు తెచ్చుకున్నారు. వీళ్లు ట్రెడిషనల్ గా చూస్తే కిరాణం, జ్యుయెలరీ, స్వీట్స్, వడ్డీ వ్యాపారాలు చేశారు. కాలం మారినా కొద్దీ అప్డేట్ అయ్యారు. ఎలక్ట్రానిక్స్ దగ్గర్నుంచి చెప్పులు, శానిటరీ, హార్డ్ వేర్, గ్రానైట్, ఒక్కటేమిటి వీరు ప్రస్తుతం చేయని వ్యాపారం అంటూ లేదు. అందరిలా 9 టూ ఫైవ్ జాబ్ చెయ్యరు. సొంత బిజినెస్ లనే నమ్ముకుంటారు. అంతే కాదు.. స్కూల్ కు వెళ్లే పిల్లలనూ హాలిడే వచ్చిందంటే షాప్ లో కూర్చోబెట్టుకుంటారు. అంటే మిగితా పిల్లలతో పోలిస్తే పదేళ్లు బిజినెస్, అకౌంటింగ్, ఆర్థిక నైపుణ్యాలు, డెసిజషన్ మేకింగ్, కస్టమర్ రిలేషన్ ఇలాంటి వాటిలో చాలా అడ్వాన్స్ గా ఉంటారన్న మాట. ఇవన్నీ ప్రాక్టికల్ గా వచ్చే అనుభవాలు. మిగితా పిల్లల మాదిరి ఎక్కడా ఆటపాటల్లో పెద్దగా కనిపించరు. మార్కెట్ డిమాండ్‌ను త్వరగా అర్థం చేసుకుని డీల్ చేస్తుంటారు. తమ షాపుల్లో వస్తువులను తక్కువ ధరలకు అందిస్తారన్న పేరుంది. అయితే ఇక్కడ నకిలీ ఉత్పత్తుల్ని అంటగడుతున్నారన్న వెర్షన్ ను కొందరు వినిపిస్తున్నారు. అంతే కాదు హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు సప్లై చైన్ వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. అందుకే తక్కువకే మాల్ తెచ్చుకుని తమ మార్జిన్ చూసుకుని అమ్ముతుంటారు. అదే మిగితా వ్యాపారులకు బల్క్ లో ఇంత తక్కువగా మెటీరియల్ దొరకదు. అందుకే స్థానిక వ్యాపారుల్లో ఆందోళన పెరుగుతోంది.

బిజినెస్ పరంగా మార్వాడీలకు బలమైన నెట్ వర్క్

మార్వాడీలు ఆర్థిక క్రమశిక్షణతో ఉంటారు. వ్యాపారంలో లాభాలను మళ్లీ పెట్టుబడి పెట్టడం, ఖర్చులను తగ్గించడం, అప్పుల్ని జాగ్రత్తగా నిర్వహించడం వంటి వ్యూహాలను ఫాలో అవుతారు. చిన్న షాపును కూడా ఏడాది తిరిగే లోపు విస్తరించే కెపాసిటీ వాళ్లకు ఉంటుంది. సామాజికంగా, బిజినెస్ పరంగా మార్వాడీలకు బలమైన నెట్ వర్క్ ఉంటుంది. తమ దగ్గర సొంత కమ్యూనిటికీ చెందిన వారినే పనిలో పెట్టుకుంటారు. నమ్మకంగా పని చేస్తారన్న ఉద్దేశంతో. అయితే ఈ ఉద్దేశం ఎలా ఉన్నా.. స్థానికంగా ఉపాధి కల్పించట్లేదన్నది తెలంగాణ వాదుల ఆందోళన. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకుంటారు. రాణిగంజ్, కోఠి, గుజరాతీ గల్లీ, మోండా మార్కెట్, బేగంబజార్ లాంటి చోట్ల వీళ్లదే హవా ఉంది.

గో బ్యాక్ మార్వాడీ చుట్టూ మతం, పార్టీ రంగు

రైట్ మార్వాడీలు కష్టపడి ఎదుగుతున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడి వరకు ఎవరూ కాదనేది లేదు. వీళ్ల చుట్టూ ఇప్పుడు మతం రంగు, పార్టీల రంగు పులుముకుంటోంది. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి రాజకీయ రంగు కూడా ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ స్వలాభం కోసం హిందూ సమాజాన్ని చీల్చేందుకు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవట్లేదంటున్నారు. మార్వాడీలను బీజేపీకి దూరం చేయడానికే ఈ రకమైన ఉద్యమాన్ని తెరమీదకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీసుకువచ్చాయంటున్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

నోరు పారేసుకుంటే జైలుకే అంటున్న రాజాసింగ్

అటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. మార్వాడీ, రాజస్థానీ, గుజరాత్ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు పారేసుకుంటే జైలే గతి అన్నారు. వాళ్లు ఎవరికీ అన్యాయం చేయడం లేదన్నారు. భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే హక్కు అందరికీ ఉందని, తమను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వాదిస్తున్నారు మార్వాడీలు. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వెనకుండి నడిపిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము కూడా రోహింగ్యాలు గో బ్యాక్ నినాదాన్ని అందుకుంటామని, వారిని కూడా తెలంగాణ నుంచి ప్రభుత్వం పంపించి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్ ​కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. అటు మార్వాడీ సమాజం నోట్లు కావాలో.. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలో తేల్చుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం కీలకంగా మారింది.

Story By Vidya Sagar, Bigtv

Related News

PC Ghosh Commission: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR

Rain Alert: బిగ్ అలర్ట్! మరో 3 రోజులు కుండపోత వర్షాలు.. ఎవరు బయటకు రావొద్దు..

Lady Aghori: లేడీ అఘోరీ కాశీకి.. వర్షిణి ఇక అంతేనా? బయటికి వచ్చిన శ్రీనివాస్ కొత్త ప్లాన్స్ ఏమిటి?

Hyderabad crime: మహిళతో కుదరని యవ్వారం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. కేపీహెచ్‌బీలో గ్యాంగ్ కలకలం!

Rajanna Sirisilla news: అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సుగంధ పట్టుచీర.. వేములవాడ అమ్మవారికి అరుదైన కానుక!

Big Stories

×