Tirumala News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలవుతోంది. ఈ విషయంలో మరో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఈ సదుపాయాన్ని తిరుమల కొండ వరకు విస్తరించినట్టు చెప్పారు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ. ఇందుకు కొన్ని రూల్స్ పెట్టారు. ఘాట్ రోడ్డు కావడంతో సిటింగ్ వరకు పరిమితం చేసినట్టు వెల్లడించారు ఛైర్మన్.
తిరుమల కొండకు వెళ్లే మహిళ భక్తులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఘాట్ రోడ్డులో నడిచే సాధారణ బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. మిగతా అన్ని బస్సులకు ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గమనించారు. లేకుంటే ఆర్టీసీ సిబ్బందితో గొడవలు తప్పవు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఆర్‌ఎంతో కలిసి ఆయన పరిశీలించారు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. అయితే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉండదని తేల్చేశారు. ఘాట్ రోడ్డులో నడిచే బస్సులు కావడంతో కేవలం కూర్చునే సీట్లు ఉంటాయన్నారు.
ఘాట్ రోడ్డులో వెళ్లే బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని తేల్చేశారు. దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ సక్సెస్ పుల్‌గా నడుస్తోంది.
ALSO READ: నాభర్త చనిపోయాడు.. లవర్ జైల్లో ఉన్నాడు, అరుణ కష్టాల కన్నీళ్లు
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఈ స్కీమ్‌ని ఉపయోగించుకుంటున్నారు. వారి నుంచి మంచి స్పందన వస్తోంది. ఆగష్టు 16న దాదాపు 10 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 17న అయితే ఏకంగా 15 లక్షల మంది ఈ స్కీమ్ ని ఉపయోగించుకున్నారు. 18న మరో 18 లక్షల మంది ప్రయాణించారు. ఈ లెక్కన మహిళలు ఈ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.
దీనివల్ల రోజుకు రూ. 6.30 కోట్లు మహిళలకు లబ్ధి చేకూరుతోంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఉపాధి కోసం ప్రతి రోజూ వెళ్లేవారు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణికులతో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడారు. ఆధార్ కార్డులు పరిశీలించారు. ఆధార్ జిరాక్స్ కాపీలను ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుందని చెప్పకనే చెప్పారు.