Hyderabad news: హైదరాబాద్ సిటీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున హైదర్‌గూడలోని బాలాజీ చెప్పుల షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ షాపులో ఉన్న సుమారు 25 లక్షల రూపాయల విలువైన ఆస్తి దగ్దమైనట్టు తెలుస్తోంది.
హైదర్‌గూడ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లెలగూడ ప్రధాన రహదారిపై స్వాగత్ గ్రాండ్ బిల్లింగ్ సెల్లార్‌లో ఫుట్‌వేర్ షాపులో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో ఒక్కసారిగా షాపులో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే భయపడిన స్థానికులు ప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి వచ్చిన ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చివరకు దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం లేదు. కాకపోతే ఆస్తి నష్టం భారీగా జరిగింది. షాపులో ఉన్న మొత్తం సరుకు అగ్నికి ఆహుతైంది. దాని విలువ దాదాపు 25 లక్షల రూపాయలు ఉంటుందని షాపు జయమాని శ్రీనివాస్ తెలిపాడు.
ఈ ఘటనపై మీర్‌పేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా. గతరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపివేశారు. ఈ సమయంలో షాపులో మంటలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్‌పై అధికార పార్టీ ఫోకస్
మరోవైపు ఏపీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మునూత్ బ్యాటరీల తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున లిథియం అయాన్ బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. భారీగా మంటలు ఎసిగిపడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, మంటలు అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టారు.ఆ పరిశ్రమలో కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పరిశ్రమ పూర్తిస్థాయిలో దగ్ధమవడంతో ఆస్తినష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ విస్పోటనం సంభవించినట్టు చెబుతున్నారు.
దీంతో పరిశ్రమలో విలువైన బ్యారీలు, యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారం 70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో సెల్‌ఫోన్ పవర్ బ్యాంకులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం
మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్
బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు మొత్తం అగ్నికి ఆహుతి
రూ.70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా
మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక… pic.twitter.com/g7j5nAgVue
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025