BigTV English

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

Nag 100: నాగార్జున (Nagarjuna).. దివంగత దిగ్గజ నటులు, నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తన నటనలో మార్క్ చూపించిన నాగార్జున.. ఒకవైపు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు సొంతం చేసుకున్నారు. మరొకవైపు మాస్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ కి కూడా మరింత దగ్గరయ్యారు. హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా సత్తా చాటుతూ బిజీగా మారిన ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోగా సినిమాలు చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్న విషయం తెలిసిందే.


త్వరలో నాగ్ 100 వ సినిమా ప్రకటన..

కుబేర, కూలీ అంటూ పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన నాగార్జున.. ఎప్పుడు హీరోగా సినిమా ప్రకటిస్తారని అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఎదురుచూశారు. వాస్తవానికి ఈయన తోటి నటులైన బాలకృష్ణ (Balakrishna), చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatesh )వరుస సినిమాలు ప్రకటిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతుంటే.. నాగార్జున మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆయన 100 సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు ఆ ఎదురు చూపుకు ఎట్టకేలకు తెరపడింది.

ఆ రోజే ఘనంగా పూజా కార్యక్రమం..


నాగార్జున 100వ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దేవీ నవరాత్రులను పురస్కరించుకొని దసరా సందర్భంగా నాగార్జున వందవ సినిమా అనౌన్స్మెంట్ ఘనంగా జరగబోతోంది అని సమాచారం. దసరా పండుగ రోజు చాలా అట్టహాసంగా నాగార్జున వందవ సినిమా లాంచింగ్ వేడుకను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్య అతిథులు వీరే..

అంతేకాదు ఈ మూవీ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని నాగార్జున ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారట.. ఆయన చేతులు మీదుగా తొలి క్లాప్ కొట్టించి.. సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం.

ALSO READ:RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

నాగ్ 100వ సినిమా పూర్తి వివరాలు..

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ‘100 నాటౌట్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగార్జున సినిమాకు సంబంధించిన అప్డేట్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా. కార్తీక్(Ra .Karthik)దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈయన ఒక్క సినిమాకి మాత్రమే దర్శకత్వం వహించారు. నాగార్జున తన సొంత బ్యానర్ లోనే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిళితం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాలని.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని ఈ సినిమాను తీసుకురావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Related News

Allu vs Mega :పాన్ ఇండియా మెగాస్టార్ గా బన్నీ.. కథ సుఖాంతం అనుకుంటే.. మళ్లీ మొదలెట్టారే..

Fauji Movie : ‘ఫౌజీ’ లో బాలీవుడ్ బడా హీరో.. డైరెక్టర్ ప్లానింగే వేరప్పా..

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

Big Stories

×