Jabardast.. బుల్లితెరపై దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardast). ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది తమకంటూ ఒక ఉనికిని చాటుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పని చేసిన చాలా మంది కమెడియన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అందులో కొంతమంది దర్శకులుగా మారితే, మరికొంతమంది కమెడియన్స్ గా, ఇంకొంతమంది హీరోలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు అని చెప్పాలి. తొలుత పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా పనిచేసిన సుధీర్ , ఆ తర్వాత ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాతో తొలిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించారు.
రష్మీకి షాక్ ఇచ్చిన సుధీర్..
ఇకపోతే తనతో పాటు యాంకర్ గా వ్యవహరించిన రష్మీ (Rashmi)తో ఇలా ప్రేమాయణం నడిపించాలని ఎప్పటికప్పుడు వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీళ్ళిద్దరికీ సెట్ పై చాలా సార్లు పెళ్లి కూడా చేశారు నిర్వాహకులు. దీంతో నిజంగానే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తాము స్నేహితులమని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు..ఇకపోతే మరొకవైపు రష్మీ వరుస షోలు చేస్తూ బిజీగా మారగా.. ఇటు సుధీర్ కూడా తన సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇకపోతే ఎప్పటికప్పుడు సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు రాగా అవన్నీ కూడా పుకార్లు గానే నిలిచాయి. కానీ ఇప్పుడు మరో వార్త వైరల్ గా మారుతోంది. అందులోనూ పెళ్లికూతురు ఎవరో కూడా చెప్పడంతో ఈ విషయాలు మరింత హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు.
నిర్మాత కూతుర్ని వివాహం చేసుకోబోతున్న సుధీర్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ నిర్మాత కూతురికి సుడిగాలి సుధీర్ బాగా నచ్చేసారట. దీంతో ఆ నిర్మాత స్వయంగా సుడిగాలి సుధీర్ వద్దకు వెళ్లి తన కూతుర్ని వివాహం చేసుకోవాల్సిందిగా కోరారట. ఇక టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరు దక్కించుకున్న ఈయన ఎంతోమంది హీరోలతో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నారు. అలాంటి పెద్ద వ్యక్తి స్వయంగా వచ్చి అడగడంతో కాదనలేక ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది మొదట్లోనే వీరి వివాహం జరగబోతోందట. ఇకపోతే టాలీవుడ్ లో ఆ బడా నిర్మాత ఎవరు? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్షన్ లో ఉంచినట్లు తెలుస్తోంది.
సుడిగాలి సుధీర్ కెరియర్..
ఇక సుధీర్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంకి మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ‘ది గ్రేటెస్ట్ ఆల్ టైం’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సుధీర్ వివాహం చేసుకోబోతున్నారని తెలిసి, ఇదైనా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.