E-Paper
Advertisement

రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్

రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్
Advertisement

True Crime Documentary on OTT: సమాజంలో మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం. బయటి వాళ్ళు మోసం చేస్తే భరించవచ్చు కానీ, ప్రాణంగా నమ్మిన సొంత రక్తమే వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా మన కష్టంతో సంపాదించిన డబ్బును, మనకు అత్యంత దగ్గరైన వ్యక్తే దొంగిలిస్తే ఆ షాక్ నుంచి బయటపడటం అంత సులభం కాదు. హాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టాండప్ కమెడియన్ డేన్ కుక్ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన రియల్ ఫైనాన్షియల్ క్రైమ్ ఆధారంగా రూపొందిన లేటెస్ట్ ట్రూ-క్రైమ్ బయోపిక్ డాక్యుమెంటరీ ‘Funny Money: The Dane Cook Story’. తన సొంత సవతి అన్నయ్యే ఏకంగా 12 మిలియన్ డాలర్లకు పైగా డబ్బును కాజేసిన సంచలన ఘటన ఆధారంగా ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ రూపొందింది. ఓటీటీ స్క్రీన్స్ పైకి రీసెంట్ గా వచ్చిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ నిజ జీవిత మోసం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

2000వ దశకంలో డేన్ కుక్ అమెరికాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్టాండప్ కమెడియన్లలో ఒకరిగా ఎదిగాడు. తన కామెడీ ఆల్బమ్స్, లైవ్ షోలతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో వరుసగా షోలు నిర్వహించి రికార్డు సృష్టించాడు. సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకున్నాడు. అయితే ఈ విజయాల వెనుక అతడి ఆర్థిక వ్యవహారాలను చూసుకునే బాధ్యతను తన సవతి అన్నయ్య డారిల్ మెకాలీకి అప్పగించాడు. చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉన్న అన్నయ్య కావడంతో అతడిని పూర్తిగా విశ్వసించాడు.

Advertisement

కానీ ఆ నమ్మకమే డేన్ కుక్ జీవితంలో అతిపెద్ద తప్పిదంగా మారింది. డారిల్ మెకాలీ తన బిజినెస్ మేనేజర్‌గా ఉంటూ తమ్ముడి బ్యాంక్ ఖాతాల నుంచి రహస్యంగా డబ్బును విత్‌డ్రా చేయడం మొదలుపెట్టాడు. ఒకేసారి భారీ మొత్తాన్ని తీసుకోకుండా, 20 వేల డాలర్లు, 50 వేల డాలర్లు, ఒక్కోసారి లక్ష డాలర్ల చొప్పున డబ్బును మాయం చేసేవాడు. ఇలా కొన్నేళ్ల పాటు కొనసాగిన ఈ వ్యవహారంలో కనీసం 12 మిలియన్ డాలర్లను కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులో కొంత భాగాన్ని ప్లాస్టిక్‌లో చుట్టి, పాస్తా సాస్ డబ్బాల్లో దాచిపెట్టినట్లు కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

కొత్త బిజినెస్ మేనేజర్‌ను నియమించుకున్న తర్వాతే డేన్ కుక్ ఆర్థిక లావాదేవీల్లో జరుగుతున్న అవకతవకలు బయటపడ్డాయి. ఆ తర్వాత జరిగిన విచారణలో సొంత అన్నయ్యే ఈ భారీ మోసానికి పాల్పడినట్లు తేలింది. 2008లో డారిల్ అరెస్టు కాగా, 2010లో దొంగతనం, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి భార్య ఎరికా కూడా ఈ వ్యవహారంలో దోషిగా తేలింది. ఈ కేసు, కుటుంబంలో ఏర్పడిన విభేదాలు, డబ్బు పోవడం వల్ల డేన్ కుక్ ఎదుర్కొన్న మానసిక వేదన వంటి అంశాలను డాక్యుమెంటరీలో స్వయంగా అతడే వివరిస్తాడు. అంతేకాదు, ఈ మోసం వెనుక ఉన్న మరిన్ని వివరాలు, డబ్బు ఎక్కడికి వెళ్లిందనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

Advertisement

ఇది రెగ్యులర్ సినిమా కాదు.. నిజ జీవిత వ్యక్తుల ఇంటర్వ్యూలు, పాత వీడియో ఫుటేజ్, కేసు విచారణకు సంబంధించిన వివరాలతో రూపొందించిన డాక్యుమెంటరీ. ఇందులో డేన్ కుక్‌తో పాటు అతడి సోదరీమణులు కోర్ట్నీ కుక్, కెల్లీ అమాన్, భార్య కెల్సీ కుక్, చిన్ననాటి స్నేహితుడు అల్ డెల్ బెనె, కేసుతో సంబంధం ఉన్న మాజీ అధికారులు, న్యాయవాదులు, ఇతర వ్యక్తులు కనిపిస్తారు. బ్రెట్ హార్వే దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సుమారు 1 గంట 59 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 6 నుంచి Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో లేదు. నిజ జీవిత క్రైమ్ కథలు, ఆర్థిక మోసాల వెనుక ఉన్న మోసాలను తెలుసుకోవాలనుకునేవారికి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

Read Also: ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్

గెస్ట్‌హౌస్‌లో రాత్రి… లవర్స్ లైఫ్‌ను రోడ్‌మీదికి లాగిన ఆగంతకుల గ్యాంగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

70s మైసూర్ వైబ్స్… అటు ట్రెడిషన్స్ ఇటు లవ్… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తి ఖతం… కట్ చేస్తే రోడ్లపై పూనకాలు తెప్పించే హై-స్పీడ్ ఛేజ్

ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సింగనమల బొబ్బిలి రణబాలి..ఎప్పుడంటే?

ఒక్క రోజు ఇంటి పనులకే చుక్కలు… తల్లి కోసం పిల్లలకు డాడీ డెడ్లీ చాలెంజ్‌… తెలుగు ఫ్యామిలీ డ్రామా

చచ్చినా వదలని ప్రేమ మత్తు… కుక్క సాయంతో ప్రేయసికి చేరువగా… ది బాప్ ఆఫ్ ఎమోషనల్ రైడ్

Big Stories

Advertisement
×