E-Paper
Advertisement

గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం

గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం
Advertisement

Medchal Robbery: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ జగదాంబ జ్యువెలర్స్‌లో అర్థరాత్రి వేళ భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగల మూక అత్యంత పక్కా పథకం ప్రకారం జ్యువెలరీ షాపు గోడకు కన్నం వేసి లోపలికి చొరబడింది. దుకాణంలో ఉన్న విలువైన ఆభరణాలు, నగదును దర్జాగా తుడిచిపెట్టేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రూ. లక్షల విలువైన బంగారం, వెండి మాయం

Advertisement

షాపులోకి చొరబడిన దుండగులు సుమారు 250 గ్రాముల బంగారం, 8.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ. 4 లక్షల నగదును అపహరించుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం షాపును పరిశీలించిన యజమానులు, గోడకు పడిన కన్నాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి క్లూస్ టీమ్.. సీసీ కెమెరాల జల్లెడ

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలం నుండి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. దుకాణంలో ఎంత మేర సొత్తు అపహరణకు గురైందనే దానిపై యజమానుల వద్ద నుంచి పోలీసులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.

గాలింపు చర్యలు..

ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కదలికలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఈ తరహా భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి

Tags

Related News

గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణలో జనగణనకు షెడ్యూల్ ఖరారు.. ముఖ్య తేదీలు ఇవే..?

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!

Big Stories

Advertisement
×