Hyderabad City: అబ్బాయి వయస్సు 25 ఏళ్లు.. అమ్మాయి వయస్సు 22 ఏళ్లు. అనుకోకుండా వీరిద్దరి మధ్య పరిచయం మొదలైంది. అబ్బాయి ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగం, అమ్మాయి టెక్కీ. ప్రేమ ప్రపోజల్‌ని అమ్మాయి ముందు పెట్టాడు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు, కానీ యువతి ఇంట్లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన వనస్థలిపురంలో వెలుగు చూసింది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివకుమార్ కొత్తపేటలో ఉంటున్నాడు. అతడి వయస్సు 25 ఏళ్లు. ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రాంతంలో ఉంటున్నాడు. సిటీకి వచ్చిన తర్వాత వనస్థలిపురంలో ఉండే 22 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఈ క్రమంలో శివకుమార్ సదరు టెక్కీని ప్రేమించాడు.
కాకపోతే ఇదంతా వన్‌సైడ్ లవ్. మంచి రోజు చూసి తన ప్రేమను యువతికి తెలియజేశాడు. అందుకు సదరు టెక్కీ నిరాకరించింది. ఇలాంటి వద్దని, ఇద్దరు ఫ్రెండ్స్‌గా ఉందామని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కోరుకున్న అమ్మాయి ఈ విషయం చెప్పగానే తట్టుకోలేకపోయాడు శివ. అయితే ఆదివారం రాత్రి మద్యం సేవించి, వనస్థలిపురంలోకి యువతి ఇంటికి వెళ్లాడు. తన ప్రేమను అంగీకరించాలని పదేపదే ప్రాధేయపడ్డాడు. కానీ, ఆ యువతి అందుకు ససేమిరా అని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలో శివకుమార్ స్నేహితుడికి సరదు యువతి ఫోన్ చేసింది. క్యాబ్ బుక్ చేసి పంపాలని కోరింది. యువతి ఆటో వద్ద వెయిట్ చేస్తుండగా, శివకుమార్ ఆమె బెడ్‌రూమ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కింద ఆటో వద్దనున్న టెక్కీ పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లోకి వెళ్లింది. ఆటో డ్రైవర్, స్థానికుల సాయంతో డోర్ తెరిచి చూసింది. అప్పటికే శివకుమార్ ఉరేసుకుని ఈ లోకాన్ని వదిలిపెట్టేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై యువతి, శివ ఫ్రెండ్స్ నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. శివ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.
ALSO READ: తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్