E-Paper
Advertisement

గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి

గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన విచ్చలవిడి అప్పులను దిద్దుబాటు చేస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని సుమారు రూ.9,053.48 కోట్ల వ్యయంతో 13 ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ.8,లక్షల 11 వేల కోట్ల అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ చేసిన అప్పులకు, తప్పులకు నెలకు రూ.80 వేల కోట్లు వడ్డీలు, అసలు రూపంలో చెల్లిస్తున్నా మన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 34 నెలల్లోనే రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చెల్లించాల్సి వచ్చిందని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని,ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు పడేలా చర్యలు తీసుకున్నామని, 1 జనవరి 2024 నుంచి 11 లక్షల మంది ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు జమ అవుతున్నాయని సీఎం గుర్తుచేశారు.

పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్ పోయిండు..

Advertisement

బూర్గుల రామకృష్ణారావు కాలం నుంచి పాలమూరు జిల్లాకు ఎంతోమంది ప్రాతినిధ్యం వహించినా వలసలు ఆగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపిస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మామని, కానీ, సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయాడే తప్ప ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రాజెక్టులను పడావు పెట్టి, కక్షగట్టి పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడని సీఎం ఆరోపించారు. 2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో, కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తమకు ప్రజలు అవకాశం ఇచ్చారని, సీఎంగా ప్రమాణం చేసిన క్షణం నుంచి ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని సీఎం చెప్పారు.

కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం

Advertisement

గతంలో కొడంగల్ బిడ్డలు చదువు కోసం పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు కొడంగల్‌నే ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని సీఎం వెల్లడించారు.ఇక మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులను అడ్డుకోవాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని, ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను కొడంగల్ బీడు భూములకు మళ్లిస్తామని శ్రీ పోలేపల్లి ఎల్లమ్మతల్లి సాక్షిగా సీఎం ప్రమాణం చేశారు. ఇక కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టిందని, బుద్ది రావడానికి ఎన్నేండ్లు పడుతుందో? అని సీఎం వ్యంగ్యంగా విమర్శించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి కాదని సీఎం ఎద్దేవా చేశారు. పది జన్మలెత్తినా నువ్వు రేవంత్ రెడ్డివి కాలేవని, రేవంత్ కావాలంటే గుండె ధైర్యం, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ ఉండాలని సీఎం కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ కార్యక్రమాలు

రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తనదని ముఖ్యమంత్రి ప్రకటించారు.సంక్రాంతి పండుగ తర్వాత ‘ప్రజాబలం’ పేరుతో ప్రజల్లోకి వస్తామని, అందరం కలసికట్టుగా ఎల్నినో వంటి సవాళ్లను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రజాబలంతో సునామీ సృష్టిస్తామని, ఆ సునామీలో మోదీ, కేడీలు కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.మరోవైపు జర్నలిస్టులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు.

రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు..

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు జరిగాయి. కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు–2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు, రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ చేశారు. అంతేగాక హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

Also Read: హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

Tags

Related News

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణలో జనగణనకు షెడ్యూల్ ఖరారు.. ముఖ్య తేదీలు ఇవే..?

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?

Big Stories

Advertisement
×