E-Paper
Advertisement

Office Misconduct: రైతు కార్యాలయంలో మందు పార్టీ రచ్చ రచ్చ.. బరితెగించిన ఉద్యోగులు

Office Misconduct: రైతు కార్యాలయంలో మందు పార్టీ రచ్చ రచ్చ.. బరితెగించిన ఉద్యోగులు
Advertisement

Office Misconduct: స్వేచ్ఛ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతుసేవా సహకార సంఘం కార్యాలయాన్ని( సింగిల్ విండో) ఉద్యోగులు సిట్టింగ్ రూంగా మార్చి మందు పార్టీ చేసుకున్నారు. ఏకంగా చైర్మన్ ఛాంబర్ లోనే దుకాణం తెరిచి మందు తాగారు. మంగళవారం అర్థరాత్రి వరకు మోత్కూరు సింగిల్ విండో కార్యాలయం తెరిచి ఉంచి యధేచ్ఛగా కార్యాలయంలోనే నలుగురు ఉద్యోగులు మందు తాగుతున్నారు.

నలుగురు ఉద్యోగులు..

మోత్కూరు సింగిల్ విండో కార్యాలయ ఉద్యోగులతో పాటు నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్ మోత్కూరు బ్రాంచ్ ఉద్యోగి పృధ్వి, అడ్డగూడూరు సింగిల్విండో కంప్యూటర్ ఆపరేటర్ శివతో కలిసి నలుగురు ఉద్యోగులు మందు తాగుతున్న వారిలో ఉన్నారు. విధులు ముగించుకుని కార్యాలయం మూసేసి వెళ్లాల్సిన ఉద్యోగులు ఇలా కార్యాలయంలోనే మందు పార్టీ చేసుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read; వైద్యరంగంలో సరికొత్త రికార్డు.. కోత లేకుండానే ఓ క్రిటికల్ సర్జరీ సక్సెస్..!

కార్యాలయంలోనే మందు పార్టీలు

కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు చైర్మన్ ఛాంబర్కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా చైర్మన్ టేబుల్పై మందు బాటిళ్లు, బజ్జీలు పెట్టుకుని తాగుతున్నారు.పాలకవర్గాలు లేకపోవడం, ఉద్యోగులపై అజమాయిషీ లేకపోవడంతోనే ఇలా బరితెగించి కార్యాలయంలోనే మందు పార్టీలు చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్విండో కార్యాలయం చైర్మన్ ఛాంబర్లోనే మందు పార్టీ చేసుకున్న ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisement

Also Read: ఇండియన్ నేవీలో అగ్నివీర్ కొలువులు.. మంచి భవిష్యత్తు, ఇంకెందుకు ఆలస్యం

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×