E-Paper
Advertisement

ఆసియా క‌ప్ లో న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్

ఆసియా క‌ప్ లో న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్
Advertisement

Trolls On Pakistan Fielding:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND Vs PAK U19 Asia Cup Clash ) మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పడుతూ లేస్తూ 208 పరుగులు సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా పాకిస్తాన్ జట్టు చెత్త ఫీల్డింగ్ ప్రదర్శించి, నవ్వుల పాలయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల ఒకే క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్టర్స్ పరిగెత్తుతూ వచ్చి చివరి నిమిషంలో దాన్ని వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఫీల్డింగ్ పై మళ్లీ ట్రోల్స్ షురూ అయ్యాయి.

న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s U19 Asia Cup 2026) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గాల్లోకి లేచిన బంతిని అందుకునే క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు ముగ్గురు విఫలమయ్యారు. మహమ్మద్ సయ్యామ్, హంజా జ‌హుర్ తో పాటు మ‌రో ఆటగాడి మ‌ధ్య‌ కమ్యూనికేషన్ లోపం కారణంగా సింపుల్ క్యాచ్ నేల పాలైంది. దీంతో ఒక‌రి ముఖాలు మ‌రొక‌రు చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్ సీనియర్ జట్టులో ఉన్న షోయబ్ మాలిక్, స‌యీద్ అజ్మల్ ఇద్ద‌రు క్యాచ్ మిస్ చేసిన‌ సంఘటనను జూనియ‌ర్ పాక్ ప్లేయ‌ర్లు గుర్తు చేశారని క్రికెట్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Advertisement

 

Related News

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

ఏంటీ 40 కోట్లు కావాలా? ఒక‌సారి మీ ముఖాల‌ను అందంలో చూసుకోండి..మంజ్రేక‌ర్ ఫైర్

కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరప్పా…రాహుల్ ను త‌న కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడు

Big Stories

Advertisement
×