E-Paper
Advertisement

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు
Advertisement

Work From Parks: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన సైబరాబాద్ పరిధిలో పేరుకు తగ్గట్టుగానే సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా అధికారుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా సైబరాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది ఐటీ కారిడార్, టెక్కీలు. విపత్కర పరిస్థితులు, వరదలు, ప్యాండమిక్ సమయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించే టెక్కీలు ఇకపై వర్క్ ఫ్రమ్ పార్క్ చేసుకునేందుకు వీలుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పార్కులను తీర్చిదిద్దుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ లో రెండు పార్కులను వర్క్ ఫ్రమ్ పార్క్ నుంచి చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాత పార్కులు సుమారు 97 వరకు ఉండగా, కొత్తగా మరో 300 పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటిలో తొలుత పార్కులను వర్క్ ఫ్రమ్ పార్క్ గా చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి తరహా రెండు పార్కులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు. మిగిలిన మరో 38 పార్కులను జనవరి మాసంలో వచ్చే సంక్రాంతి పండుగ కల్లా పూర్తి చేస్తామని తెలిపారు.

ఇక పార్కు నుంచే ఆఫీస్ పని!

Advertisement

నిరంతరం యాంత్రిక జీవనాన్ని గడిపే టెక్కీలు చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్క్ నుంచి పని చేసుకునేలా ఈ పార్కులను తీర్చిదిద్దుతున్నారు. ఈ పార్కులో టెక్కీలకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించటంతో పాటు వారికి కాఫీ, టీ, టిఫిన్, స్నాక్స్ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రతి వర్క్ ప్రమ్ పార్క్ లో కెఫ్టేరియాను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇలాంటి పార్క్ లలో ఎంట్రీ, కెఫ్టేరియాలో టీ, టిఫిన్, స్నాక్స్ ధరలను నిర్ణయించే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ పార్కులను ఆధునిక ప్రమాణాలతో నిర్వహించేందుకు వీలుగా నిర్వహణ వ్యయాన్ని సమకూర్చుకునేలా ఛార్జీలు వర్తింపజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి పార్క్ లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏర్పాటును ప్రోత్సహించేందుకు పలు మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత రెండు వర్క్ ఫ్రమ్ పార్క్ లను కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు, మున్ముందు అవసరాలను బట్టి ఇలాంటి వర్క్ ఫ్రమ్ పార్కులను సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.

డిఫరెంట్ వర్కింగ్ స్టైల్

Advertisement

సాధారణంగా టెక్కీలు ఐటీ కారిడార్ లోని తమ ఆఫీసుల్లో , కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రమ్ హోమ్ చేస్తుంటారు. కానీ వారికి డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ను అలవాటు చేసేందుకు, వారిలో స్ట్రెస్ ను తగ్గించేందుకు ఈ వర్క్ ఫ్రమ్ పార్క్ స్టైల్ ను తీసుకువస్తున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మొత్తం సీసీ కెమెరాలతో కవర్ అయ్యే ఈ పార్కులో టెక్కీలకు ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందుబాటులో ఉంచటంతో పాటు వారు ఆఫీసులో, ఇంట్లో కూర్చోని పని చేసుకున్న మాదిరిగానే సిట్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారు తెచ్చుకునే ల్యాప్ టాప్ లకు కరెంటు సరఫరా కూడా పార్కులో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి రెండు పార్కులను వచ్చే న్యూ ఈయర్ వేడుకలకు ముందే అందుబాటులోకి తెచ్చేలా సీఎంసీ అధికారులు పనులను ముమ్మరం చేశారు. ఈ పార్కుల ఏర్పాటు ఆదాయం కోసం కాకుండా టెక్కీలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచేందుకు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు, కెఫ్టెరియాలోని టీ, టీఫిన్, స్నాక్స్, ఎంట్రీ ఛార్జీలు పార్కును మరింత మెరుగుగా నిర్వహించేందుకు వీలుగా నామమాత్రంగా వసూలు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మూడు నెలల్లో అన్ని ఓపెన్ ప్లేస్ లకు కాంపౌండ్ వాల్స్

సైబరాబాద్ మున్నిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 700 ఓపెన్ ప్లేస్ లున్నాయని, వాటిలో 300 ఓపెన్ ప్లేస్ లకు ప్రస్తుతం కాంపౌండ్ వాల్స్ నిర్మించి ఉన్నాయని, మరో 470 ఓపెన్ ప్లేస్ లను కాపాడుకునేందుకు వాటికి కాంపౌండ్ వాల్స్ ను నిర్మించేందుకు మంజూరీ వచ్చిందని, రానున్న మూడు నెలల్లోపు వాటికి కూడా కాంపౌండ్ వాల్స్ ను నిర్మించనున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన తెలిపారు.

Also Read: ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

Tags

Related News

ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

తెలంగాణ వైద్యరంగంలో బిగ్ అప్‌డేట్.. ఒకేసారి 359 పీజీ సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్!

రాహుల్‌ గాంధీకి నల్ల జెండాల నిరసన తప్పదు: రాంచందర్ రావు

Big Stories

Advertisement
×