E-Paper
Advertisement

ధరణి అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 9 మంది అరెస్ట్ కీలక నేతగా..?

ధరణి అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 9 మంది అరెస్ట్ కీలక నేతగా..?
Advertisement

Dharani Scam: స్వేచ్చ బ్యూరో: సీఐడీ పోలీసులు 15 బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు జరిపారు. ఈ క్రమంలో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందే నలుగురిని పట్టుకున్న నేపథ్యంలో అరెస్ట్​ అయిన వారి సంఖ్య 9కి చేరింది. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని కొంతమంది భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కొందరు విచ్చలవిడిగా ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా వార్తలొచ్చాయి. దాంతో కాంగ్రెస్​ ప్రభుత్వం దీనిపై విచారణ కోసం సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో సిట్​ ఏర్పాటు చేసింది.

అక్రమంగా లాగిన్..

సిట్​ విచారణలో కొంతమంది ఆపరేటర్లు ధరణి పోర్టల్​ లోకి అక్రమంగా లాగిన్​ అయి భూ రికార్డులను తారుమారు చేయటంతోపాటు కోట్ల రూపాయల విలువ చేసే భూదాన్​ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపైకి మార్చినట్టుగా వెల్లడైంది. ఈ మేరకు సిట్​ ఇచ్చిన నివేదిక, ఫోరెన్సిక్​ ఆడిట్​ లో బయటపడ్డ వివరాలతో ప్రత్యేక బృందాలు శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరిన సిద్దిపేట తదితర జిల్లాల్లో దాడులు జరిపారు. ధరణి పోర్టల్​ సాఫ్ట్​ వేర్​ డిజైన్​, నిర్వహణా బాధ్యతలు చూసిన ప్రైవేట్​ సంస్థ పాత్ర, పోర్టల్​ లోకి అక్రమ యాక్సెస్​ కల్పించటం, లాగ్ ఇన్​ ఐడీల దుర్వినియోగం వంటి అంశాలపై విచారణ చేస్తున్నారు.

వెనుక ఎవరున్నారు?

Advertisement

ఈ అక్రమాల వెనుక ఎవరున్నారు? భూముల రికార్డులను మార్చేందుకు ఎలాంటి పద్ధతులు ఉపయోగించారు? ఈ వ్యవహారంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉంది? అన్న కోణాల్లో కూడా సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తనిఖీలు జరిపి ధరణి పోర్టల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆపరేటర్లు, డేటా ఎంట్రీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోర్టల్‌ లోకి ఎవరెవరు లాగిన్ అయ్యారు? ఏ సమయంలో ఏ రికార్డుల్లో మార్పులు చేశారు? వాటికి సంబంధించిన అనుమతులు ఎవరు ఇచ్చారు? అన్న అంశాలపై వివరాలు సేకరించారు.

Also Read: సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!

అనధికారిక మార్పులు..

Advertisement

సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో ధరణి పోర్టల్‌లోకి అక్రమంగా లాగ్ ఇన్​ అయి భూముల యాజమాన్య వివరాలను మార్చినట్టుగా వెల్లడైందని సమాచారం. విలువైన భూముల రికార్డుల్లో అనధికారిక మార్పులు చేసి అసలు యజమానుల హక్కులకు భంగం కలిగించినట్టుగా తేలిందని తెలియవచ్చింది. ఈ క్రమంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సిబ్బంది పాత్రపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. ప్రాథమిక విచారణలో నిందితులుగా అనుమానిస్తున్న కొందరి పాత్రపై ఆధారాలు లభించడంతో అరెస్టులు చేశారు.

రికార్డుల్లో మార్పులు చేశారా?

ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు. కోర్టుల్లో కేసులు నడుస్తున్న భూములకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని ధరణి రికార్డుల్లో అక్రమ మార్పులు చేసినట్టుగా తెలుస్తుండటం. సాధారణంగా భూములపై వివాదాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు యాజమాన్య హక్కులు, భూముల లావాదేవీలకు సంబంధించి మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తుంటాయి. అలాంటి ఉత్తర్వులను తప్పుగా ఉపయోగించుకుని రికార్డుల్లో మార్పులు చేశారా? లేదా కోర్టు ఆదేశాల పరిధిని దాటి భూముల హక్కులను ఇతరులకు బదిలీ చేశారా? అన్నదానిని అధికారులు పరిశీలిస్తున్నారు.​

Also Read: కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!

Tags

Related News

కటకటాల వెనుక అక్షర వెలుగులు.. ఖైదీల విద్యా హక్కుపై తెలంగాణ సంచలనం!

తెలంగాణ యంగ్ క్రికెటర్లకు భారీ గుడ్ న్యూస్..?

అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!

గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్

Big Stories

Advertisement
×