E-Paper
Advertisement

KTR: కేసీఆర్ దార్శనికత వల్లే వరంగల్‌కు మెగా టెక్స్‌టైల్ పార్క్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: కేసీఆర్ దార్శనికత వల్లే వరంగల్‌కు మెగా టెక్స్‌టైల్ పార్క్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: వరంగల్ జిల్లా, నగరాభివృద్ధిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దార్శనికత వల్లే వరంగల్‌కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అజంజాహీ మిల్లు మూతపడడంతో ఓరుగల్లు నేతన్నలు వలస పోయారని గుర్తు చేశారు. నేతన్నల పరిస్థితి మారాలని.. వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా చేయాలనే సంకల్పంతో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేటీఆర్ తెలిపారు. కరోనా కారణంగా పనుల్లో కొంత ఇబ్బంది ఎదురైందని వివరించారు.

కైటెక్స్, గణేశా, యంగ్ వన్ వంటి సంస్థల ద్వారా సుమారు 30 వేల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే.. టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన ఆ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ పాలనలో జరిగిన పరిపాలన సంస్కరణలను కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలోనే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని.. రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సంఖ్యను పెంచి అధికారాన్ని వికేంద్రీకరించే పని చేశామని చెప్పారు. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం GHMCలో కార్పొరేషన్లను విలీనం చేస్తోందని ఆరోపించారు. కనీసం GHMCలో చర్చించకుండా.. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

హిల్‌టాప్ పాలసీని ఎవరి కోసం తెస్తున్నారో వారికే తెలియాలని ఎద్దేవా చేశారు. 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ సొత్తు తెలంగాణ ప్రజలదని ఆయన అన్నారు. గతంలో తాము హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పొల్యూటెడ్ కంపెనీలను బయటకు తరలించే ప్రయత్నం చేశామని.. .కానీ ఈ రోజు ఫ్యూచర్ సిటీ పేరుతో దోపిడీకి తెరలేపారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి ఏటీఎం, పేటీఎం లాగా మారాడని విమర్శించారు. ప్రభుత్వ తీరును ఉద్దేశించి.. ‘కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్లు’ ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దానిని కొల్లగొట్టి 17 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మొసలి కన్నీళ్లు కారుస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: TDP VS YCP AI War: బాబు ఏడుపు.. రోడ్డుపై జగన్‌.. ఏపీలో AI రాజకీయం

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×