E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో కాసేపట్లో సత్య నాదెళ్ల భేటీ.. మైక్రోసాఫ్ట్ విస్తరణపై చర్చ

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో కాసేపట్లో సత్య నాదెళ్ల భేటీ..  మైక్రోసాఫ్ట్ విస్తరణపై చర్చ
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తమ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ.

రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని కోనుగోలు చేసింది. స్టాప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందట ప్లాన్ చేసింది ఆ కంపెనీ.

Advertisement

ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య‌ నాదెళ్ల. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా భావిస్తోంది ఐటీ ఇండస్ట్రీ. ప్రపంచంలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ కావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం.

అన్నట్లు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు సత్య నాదెళ్ల.  ఇండియాకు వచ్చిన ప్రతీసారీ హైదరాబాద్‌ విజిట్ చేస్తున్నారు. ఇక వ్యాపారాల విషయానికొస్తే.. భారత్‌లో పూణె, ముంబై, చెన్నై నగరాల తర్వాత డేటా సెంటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ వంతైంది. సీఎంతో భేటీ వెనుక ఏయే అంశాలు చర్చకు వస్తాయో చూడాలి.

Advertisement

ALSO READ:  రెండు వారాల్లో తెలంగాణకు కొత్త అధ్యక్షుడు.. రేసులో ఆ ‘నలుగురు’

Related News

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×