Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో ఆయన “జన్మనిచ్చిన ఆ మహనీయుని స్మరించుకుంటూ” అంటూ తన తండ్రి డెత్ యానివర్సరీ రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తూ కనిపించారు.
తాజాగా చిరంజీవి (Chiranjeevi) షేర్ చేసిన ఆ పోస్ట్ లో తన సోదరుడు నాగబాబుతో కలిసి పూజలు చేస్తూ కనిపించారు. అలాగే ఆ ఫోటోలలో నాగబాబు భార్య, చిరంజీవి భార్య సురేఖ, చిరంజీవి తల్లి అంజనమ్మ కూడా కనిపిస్తున్నారు. ఆ పోస్ట్ కి “జన్మనిచ్చిన ఆ మహనీయుని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ…” అంటూ రాస్కొచ్చారు చిరు. తమ తండ్రి స్వర్గస్తులైన ఈరోజు చిరు కుటుంబం అంతా ఆయనను స్మరించుకుంటూ కనిపించారు. అయితే తమ తండ్రి డెత్ యానివర్సరీ రోజున పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం ఎక్కడా ఈ ఫోటోలలో కనిపించకపోవడం గమనార్హం. ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
https://x.com/KChiruTweets/status/1873622459762786612
ఇదిలా ఉండగా చిరంజీవి (Chiranjeevi) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా చూసి రివ్యూ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘గేమ్ ఛేంజర్’ మూవీ గురించి టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీని జనవరి 10న థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఇక సినిమా రిలీజ్ కు పట్టుమని పది రోజులు కూడా టైం లేకపోవడంతో మూవీ టాక్ ఏంటి అనే ఆతృత పెరిగిపోయింది. సుమారు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ కావడంతో హిట్ కొట్టడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే చిరంజీవి కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చారని తెలుస్తోంది.
డిసెంబర్ 29న రామ్ చరణ్ (Ram Charan) భారీ కటౌట్ ని విజయవాడలో ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు తను విజయవాడకు వచ్చే ముందు చిరంజీవికి ఫోన్ చేశానని వేదికపైన చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చిరంజీవి “ఈ సంక్రాంతికి మనం మామూలుగా కొట్టడం లేదని అభిమానులకు చెప్పండి” అని చెప్పారంటూ మెగా ఫాన్స్ లో ఫుల్ జోష్ పెంచారు.
ఇక మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరవుతానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జనవరి 4 లేదా 5వ తేదీల్లో ఏపీలోనే ఈ సినిమా భారీ ఈవెంట్ ను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు. జనవరి 1న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైనా మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్లలో వేగం పెంచడంతో ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్.