BigTV English

BJP New President In Telangna: రెండు వారాల్లో తెలంగాణకు కొత్త అధ్యక్షుడు.. రేసులో ఆ ‘నలుగురు’

BJP New President In Telangna: రెండు వారాల్లో తెలంగాణకు కొత్త అధ్యక్షుడు.. రేసులో ఆ ‘నలుగురు’

BJP New President In Telangna: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు? హైకమాండ్ తన నిర్ణయాన్ని ఇంకా సాగదీస్తుందా? జనవరి రెండోవారానికి తేల్చుతుందా? అధినేత ఎవరనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. సామాజిక సమీకరణాల కాకుండా.. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడ్ని ఎంపిక చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఢిల్లీలో ఆదివారం జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన్ సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ ఛార్జులు హాజరయ్యారు. తెలుగు రాష్ఠ్రాల నుంచి పురందేశ్వరి, కిషన్‌రెడ్డి, డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను నడ్డాకు అందజేశారు కిషన్‌రెడ్డి.

తెలంగాణలో దాదాపు 70 శాతం బూత్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయినట్టు తెలిపారు కిషన్‌రెడ్డి. జనవరి ఫస్ట్ వీక్‌లో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ చేయనున్నారు. సెకండ్ వీక్‌లో కొత్త అధ్యక్షుడిపై ప్రకటన రానుంది. దీంతో కొత్త బాస్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


కొత్త అధ్యక్షుడి రేసులో నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారంతా ఎంపీలే కావడం గమనార్హం. ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, బండి సంజయ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరూ రేసులో లేనట్టు తెలుస్తోంది.

ALSO READ: రేవంత్ సర్కార్ న్యూయర్ గిఫ్ట్.. జనవరిలో ఈ స్కీమ్

ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అధిష్టానికి కత్తి మీద సాముగా మారింది. ఈ నలుగులు ఎవరికైనా ఇస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయని భావించి కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తుందా? అనే చర్చ లేకపోలేదు. ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే.

మరోవైపు అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేశాయనే చర్చ మొదలైంది. దాని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో దళత వ్యక్తిని జాతీయ అధ్యక్ష పీఠంపై కూర్చొబెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తోందట.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా దళిత నేత మల్లికార్జునఖర్గే ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా దళిత వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నట్లు ఓ వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో హంగామా చేస్తోంది. అంబేద్కర్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంతకంటే మార్గం మరొకటి లేదన్నది కొందరి నేతల మాట.

మరి ఈసారి అధ్యక్షుడు ఎటువైపు వారికి ఇస్తారు?  ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌ ప్రాంతాల నుంచి కొందరి నేతలను ఎంపిక చేశారు. ఈసారి దక్షిణాది నేతకు ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తోంది. దీనివల్ల వచ్చే ఎన్నికల నాటికి సౌత్‌లో కమలం ఊపు వస్తుందని భావిస్తున్నారు. గతంలో బంగారు లక్ష్మణ్ మాత్రమే ఈ పదవిని అందుకున్న విషయం తెల్సిందే. ఈసారి రేసులో ఎవరుంటారో చూడాలి.

Related News

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Big Stories

×