Earth Tremors: గ్రేటర్ హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లోని గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడా అనే ప్రాంతంలో బూ ప్రకంపనలు సంభవించాయని అక్కడి స్ధానికులు తెలిపారు. ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు దీంతో అక్కడ భారీగా శబ్దం వచ్చిందని అక్కడి స్థానికులు తెలిపారు.
భారీ శబ్ధానికి అక్కడి పరిసర ప్రాంతంలోని ప్రజలు పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నుండి భయంతో జనం బయటికి పరుగులు తీసారు. అయితే ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రస్థుతానికి అక్కడి ప్రజలు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నిజంగా భూ ప్రకంపన వల్ల జరిందా.. లేక ఏవరైనా కావాలని సృష్టించారా అనే అంశంపై అక్కడి అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారని సమాచారం.
సాదారణంగా భూమిపై హైదరాబాద్ పట్టణం దక్షిణ భారతదేశంలోని డెక్కన్ ప్రాంతంలో కలదు. ఇది సముద్రానికి కనీసం 540 అడుగుల ఎత్తులో భాగ్యనగరం కలదు. దీంతో భూకంపాలకు, మరియు ప్రకృతి వైపరిత్యాలకు తట్టుకుని నిలబడేంత అనువైన ప్రదేశంలో హైదరాబాద్ పట్టనం నిర్మితమై ఉంది. ఇంత అనువైన ప్రదేశంలో ప్రాంతంలో భూ ప్రకంపణలు రావడం అందరిని ఆశ్యరానికి గురిచేస్తుందని, ఈ సంఘటనపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అక్కడి అధికారులు అనుకునంటున్నట్టు సమాచారం.