Hight Tension at Hyderabad Patabasti: హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్, బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎదురెదురయ్యారని, ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను పాతబస్తీవాసులు అడ్డుకున్నారని తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే రూట్ లో రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు యువకులను అక్కడి నుంచి పంపించివేసినట్లు తెలుస్తోంది.