Poco F6 Launching on May 23rd: స్మార్ట్‌ఫోన్లకు భారత మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో రకాల మోడళ్లలో కొత్త కొత్త వేరియంట్లను పరిచయం చేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Poco ఇప్పుడు తన కొత్త ఫోన్‌ను భారతదేశంలోకి తీసుకు రావడానికి సిద్ధమైంది. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Poco F6’ ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ కూడా వెల్లడయింది.
కంపెనీ భారతదేశంలో Poco F6ని మే 23, 2024న లాంచ్ చేస్తుందని తెలిపింది. ఈ లాంచ్ ఈవెంట్ మే 23 సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఫోన్ లాంచ్ తేదీని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వెల్లడించారు. కస్టమర్లు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయగలుగుతారు. అంతేకాకుండా, మైక్రో సైట్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఈ ఫోన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Poco F6 Specifications
Poco F6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు అనేక ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే సపోర్ట్ ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్‌లో మార్కెట్‌లోకి రానుంది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. Poco F6 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. ఇది సోనీ LYT 600 సెన్సార్‌తో వస్తుంది. 8MP అల్ట్రా వైడ్ కెమెరాను ఫోన్‌లో అందించారు. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత హైపర్‌ఓఎస్ మద్దతుతో వస్తుంది.
Also Read: పోకో కొత్త ఫోన్ లాంచ్.. తాజా ఆఫర్‌తో రూ.7 వేల లోపే కొనేయొచ్చు.. ఎలాగంటే..?
ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో అందించబడుతుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌తో 3 సంవత్సరాల అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉంది. ఇక ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ వెల్లడించలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో దాదాపు రూ. 30,000 నుండి రూ. 35,000 రేంజ్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.