BigTV English

Minister Jupally Met MLA Bandla: తెలంగాణలో రాజకీయాలు..ఎమ్మెల్యే కృష్ణమోహన్‌తో మంత్రి జూపల్లి భేటీ

Minister Jupally Met MLA Bandla: తెలంగాణలో రాజకీయాలు..ఎమ్మెల్యే కృష్ణమోహన్‌తో మంత్రి జూపల్లి భేటీ

Minister Jupally Met MLA Bandla(Telangana politics): తెలంగాణాలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. నేతలు ఎవరు.. ఎప్పుడు ఏ పార్టీ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబ్‌నగర్‌లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశ మయ్యారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు మంత్రి జూపల్లి. ఎమ్మెల్యేతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఇరువురు నేతలు అరగంట సేపు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు నేతలు అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ సమయంలో మీడియా పలు ప్రశ్నలు లేవనెత్తింది. నాయకులు ప్రజల పక్షం ఉంటారన్న నమ్మకంతో ఓటు వేసి గెలిపించారన్నారు మంత్రి జూపల్లి. అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. వస్తున్న వార్తలు అనుమానాలు, అపోహాలు తప్పితే మరొకటి ఏమీ లేదన్నారు. ఏమీలేకుండా ఇంతదూరం ఎలా వచ్చా రంటూ మీడియా లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మంత్రి. తాను ఇంటికి వచ్చానని.. పేపర్‌లో వార్త చూసి అక్కడకు వచ్చానన్నారు. తామిద్దరం ఇప్పుడు హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు చెప్పారు.


ALSO READ: గురువును మించిన శిష్యుడు రేవంత్ రెడ్డి

అసలేం జరిగిందంటే.. రెండురోజుల కిందట తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డితో బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ఛాంబర్‌కు రావాలని ఎమ్మెల్యేని ఆహ్వానించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయనతో ఫోటోలు తీసుకున్నా రు. దాన్ని సోషల్‌మీడియాలో విడుదల చేశారు.

సొంతగూటికి గద్వాల ఎమ్మెల్యే వచ్చేశారంటూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ఈ ఎత్తుగడ వేసినట్టు చివరకు తేలిపోయింది. మరి గద్వాల ఎమ్మెల్యే మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.

 

Related News

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Heavy Rains: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

TG High Court: తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

CM Revanth: ముఖ్యమంత్రి ఇంటి గోడను కూల్చేసిన అధికారులు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

×