BigTV English

CM Reventh Reddy: రేవంత్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు

CM Reventh Reddy: రేవంత్ ను ఫాలో అవుతున్న చంద్రబాబు

Telangana CM Reventh reddy news(Telangana congress news):
చంద్రబాబు అనగానే కళ్ల మందు ఓ విజన్ కనిపిస్తుంది. విజనరీ ఉన్న నేతగా, రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబును అంతా విశ్వసిస్తారు. దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీనీ ఆయన చనిపోయాక తన భుజస్కందాలపై మోస్తూ వస్తున్నారు చంద్రబాబు. అయితే గత ఎన్నికలలో వైఎస్ జగన్ కు ఒక్క ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఏపీ ప్రజలు ఆయనను గెలిపించారు. చంద్రబాబును అనేక కేసులలో ఇరికించి బయటకు రాకుండా చేద్దామని భావించారు వైఎస్ జగన్. అనూహ్యంగా గోడకు కొట్టిన బంతిలా చంద్రబాబు తిరిగి అఖండ మెజారిటీతో గెలిచారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోనే కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి నేతలు రాజకీయంగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు వద్ద రాజకీయ శిష్యరికం చేసినవారే.


అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్

రేవంత్ రెడ్డి కూడా తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబు అంటే ఎంతో గౌరవం. తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో పన్నని వ్యాహాలు, ప్రణాళికలు బీఆర్ఎస్ ను ఓటమి పాలు చేశాయి. చంద్రబాబు కూడా తిరిగి అధికారంలోకి రావడానికి రేవంత్ ఫార్ములానే పాటించారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నాడు ధరణి పోర్టల్ లో జరిగిన అక్రమాలు, బీఆర్ఎస్ నేతలు దానిని ఎలా దుర్వినియోగం చేశారో అనేది బాగా హైలెట్ చేశారు. ఏపీలోనూ చంద్రబాబు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ర్పయోజనాలు , తాము అధికారంలోకి రాగానే దానిని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.


ఆరు గ్యారెంటీలకు ధీటుగా సూపర్ సిక్స్

అలాగే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై ఫోకస్ చేశారు. అవి ప్రజలలోకి దూసుకుపోయాయి. చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ అంటూ డైరెక్ట్ గా రేవంత్ పథకాలను కాపీ చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు ఇంకా రేవంత్ విధానాలనే పాటిస్తున్నారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించేలా వారానికికోసారి ప్రజాదర్భార్ ను నిర్వహిస్తున్నారు. ప్రజాదర్భార్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షిణం అధికారులు స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే మాదిరిగా ఏపీలోనూ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, అధికారులకు ప్రజాదర్బార్ నిర్వహించేలా డ్యూటీలు వేశారు. ఈ ప్రజాదర్బార్ ను కేవలం ఏదో మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా సమస్యలకు తక్షణ సహాయం అందించేలా మంత్రులు, అధికారులను కార్యోన్ముఖులు గా చేస్తున్నారు.

అక్కడా..ఇక్కడా శ్వేతపత్రాలు

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నాటి బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ శ్వేతపత్రాల ద్వారా బీఆర్ఎస్ అక్రమాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే యత్నం చేశారు. రీసెంట్ గా చంద్రబాబు కూడా జగన్ ప్రభుత్వంను దోషిగా నిలబెట్టేందుకు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేశారు. శాఖలవారీగా ఎంతెంత అక్రమాలు జరిగాయో, ఏ మేరకు అప్పులు చేశారో ప్రజలకు వివరించారు. ఇలా ఏ రకంగా చూసినా చంద్రబాబు రేవంత్ రెడ్డినే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×