BigTV English

McDonald Meal For 30 Days: 30 రోజులపాటు మూడు పూట్ల బర్గర్లు తిన్నాడు.. అతనికేమైందంటే?

McDonald Meal For 30 Days: 30 రోజులపాటు మూడు పూట్ల బర్గర్లు తిన్నాడు.. అతనికేమైందంటే?

McDonald Meal For 30 Days| ప్రపంచమంతా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఒక ఫ్యాషన్. ఏ దేశంలో చూసినా ఫాస్ట్ ఫుడ్ తినే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇది తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా తింటున్నారు.. ముఖ్యంగా యువత ఈ అనారోగ్యకరమైన తిండికి అలవాటు పడిపోతున్నారు. పిజ్జాలు, బర్గర్ లు, చైనీస్ ఫ్రైడ్ ఫుడ్.. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తాయి.


మరి ఇలాంటి ఫుడ్ నెలంతా తినాలి.. నెలలో ప్రతిరోజు మూడు పూటలా తింటే ఏమవుతుందో తెలుసా?.. ఈ విషయాన్ని తెలుసుకోవడానికే 2004లో ఒక డాక్యూమెంటరీ సినిమా ‘సూపర్ సైజ్ మీ’ వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో దర్శకుడు మొర్గన్ స్పార్ కల్ 30 రోజుల పాటు ప్రతీరోజు మూడు పూటలా మెక్ డొనాల్డ్స్ మీల్స్ తిన్నాడు. రోజూ లంచ్, డిన్నర్ లో చికెన్ బర్గర్, చికెన్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా మెక్కాడు. దీంతో తన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చాయో చూపించాడు.


కేవలం అయిదు రోజుల్లో అతని శరీర బరువు 9.5 పౌండ్లు(4.31 కేజీ లు) పెరిగింది. మళ్లీ 21 రోజులు పూరైన తరువాత 24.5 పౌండ్లు (11.11 కేజీ లు) బరువు పెరిగాడు. మొత్తం నెల రోజుల తరువాత అతని శరీర బరువు 16 కేజీ లు పెరిగిపోయింది. శరీరంలో 11 శాతం ఉన్న ఫ్యాట్ 18 శాతానికి చేరింది. 168 ఉన్న కొలెస్ట్రాల్ 30 రోజుల తరువాత చూస్తే.. 230 కు అంటే డేంజర్ లెవెల్ కు చేరింది.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం.. స్పర్ లాక్ ఈ డాక్యుమెంటరీ రూపొందించడానికి 65 వేల డాలర్లు ఖర్చు పెట్టాడు. కేవలం మెక్ డొనాల్డ్స్ నుంచి మాత్రమే ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఈ తిండి తినడం వల్ల అతని శరీరంలో ఇంకా చాలా మార్పులు వచ్చాయి. తలనొప్పి, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఫ్యాటీ లివర్ ఈ సమస్యలతో బాధపడ్డాడు. ఫ్యాటీ లివర్ సమస్య ఉండడంతో డాక్టర్లు అతన్ని మధ్యలోనే ఆపేయాలని సూచించారు. కానీ అతనికి మెక్ డొనాల్డ్స్ ఫుడ్ తినడం వ్యసనంగా మారిపోయిందని తెలిపాడు. అది తినకపోతే.. ఏదో కోల్పోయినట్లుగా ఉంటుందని చెప్పాడు.

ఈ డాక్యుమెంటరీ సినిమా ఆ సమయంలో విడుదలై పాశ్చాత్య దేశాల్లో 22 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మొర్గన్ స్పర్ లాక్ 2017లో ఈ డాక్యుమెంటరీకి ‘సూపర్ సైజ్ మి 2’ సీక్వెల్ కూడా తీశాడు. ఈ సినిమాలో చికెన్ బిజినెస్, ఫాస్ట్ ఫుడ్ రియాలిటీని చూపించాడు. అయితే 2024 మే నెలలో 53 ఏళ్ల స్పర్ లాక్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయాడు.

Also Read: ‘అయ్యో సగం తినేశానే’.. చికెన్ బర్గర్ లో పురుగు!

Tags

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×