BigTV English

Minister Konda Surekha: వెనక్కి తగ్గేదిలేదు, క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్‌కు కొండ సురేఖ మరోసారి వార్నింగ్

Minister Konda Surekha: వెనక్కి తగ్గేదిలేదు, క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్‌కు కొండ సురేఖ మరోసారి వార్నింగ్

Minister Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గేది లేదని ఎందుకు అంటున్నారు? కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ వెనుక అసలేం జరిగింది? మంత్రిపై బీఆర్ఎస్ సోషల్‌మీడియా వింగ్ అంత అవమానకరమైన విధంగా పోస్టులు పెట్టిందా? ఆమె కంటతడి పెట్టడం వెనుక అసలేం జరిగింది? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.


తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం ఉదయం మరోసారి నోరు విప్పారు. కేటీఆర్ విషయంలో తాను వెనక్కి తగ్గేదేలేదని తేల్చేశారామె. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేస్తే న్యాయ పరంగా ఎదుర్కొంటానని చెప్పుకొచ్చారు.

కేటీఆర్‌ తనపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు మంత్రి కొండా సురేఖ. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదన్నారు. అనుకోని సందర్భంలో ఒక కుటుంబాన్ని ప్రస్తావించడం అనుకోకుండా జరిగిందన్నారు. నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని మీడియా ముఖంగా తెలియజేశారు.


తాను క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ చేసిన డిమాండ్‌ని తప్పుబట్టారు మంత్రి కొండా సురేఖ. అసలేం జరిగింది? కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వ్యవహారాన్ని బంధంతో అంటగట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా దారుణమైన చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

ALSO READ: అమల కామెంట్స్‌పై ఎంపీ మల్లు రవి సీరియస్.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే..

అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతూ తన ప్రతిష్టను దిగజార్చేలా ట్రోలింగ్ చేయడాన్ని నిరసించారు కూడా. మీడియా ముఖంగా మంత్రి కంటతడి పెట్టారామె. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రానికి వెళ్లినా తనను అక్కా అని పిలుస్తారన్న విషయాన్ని గుర్తు చేశారు.

అధికారంలోకి రాలేదన్న కారణంతో కేటీఆర్ వెనుక ఉండి సోషల్ మీడియాను పావుగా వాడుకుంటూ ఈ తతంగాన్ని నడిపారన్నది మంత్రి మాట. ఈ విధంగా తనపై రాక్షస ఆనందం పొందారని మనసు లోని మాట బయటపెట్టారు. ప్రభుత్వ విధానాలపై విమర్శించినా భరిస్తానని, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించేది లేదన్నది మంత్రి చెబుతున్నమాట.

 

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×