BigTV English

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

World War II Bomb Japan| జపాన్ లోని మియాజాకీ ఎయిర్ పోర్టులో బుధువారం అక్టోబర్ 2, 2024న ఓ భారీ బాంబు పేలుడు సంభవించింది. అయితే ఆ బాంబు 79 ఏళ్ల క్రితం పేలాల్సి ఉండగా.. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు పేలిపోవడం ఆశ్చర్య. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా వేసిన ఒక బాంబు ఇన్నాళ్లుగా పేలకుండా ఉండిపోయింది.


రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా 1943లో నేవీ విమానాల రాకపోకల కోసం అప్పటి జపాన్ ప్రభుత్వం ఓ ఎయిర్ పోర్టు నిర్మించింది. అదే మియాజాకీ ఎయిర్ పోర్టు. ఆ ఎయిర్ పోర్టుపై అమెరికా 1945 సంవత్సరంలో ఓ భారీ బాంబు వేసింది. కానీ ఆ బాంబు భూమి లోపల ఉండిపోగా.. ఆ తరువాత కాలక్రమంలో దానిపై రన్ వే ఏర్పాడింది. అలా ఆ బాంబు భూమిలోపలే ఉండిపోయింది. అయితే అనూహ్యంగా ఆ బాంబు ఇప్పుడు పేలిపోవడం విశేషం. ఆ బాంబు రెండో ప్రపంచ యుద్ధ సమయంలోదే అని జపాన్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రిత్వశాఖ ధృవీకరించింది.

Also Read:  బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..


ఈ బాంబు పేలుడు ప్రభావం తీవ్రంగా ఉండడంతో మియాజాకీ ఎయిర్ పోర్టులో 7 మీటర్ల వెడల్సు, 1 మీటర్ లోతు వరకు గుంత ఏర్పడింది. పేలుడు జరిగిన ప్రదేశంలో ఎయిర్‌పోర్టు లగేజీ ట్యాక్సీలు రాకపోకలు జరిగేవి. అదృష్టవశాత్తు పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేరు. దీంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. పేలుడు కారణంగా ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. మియజాకీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు చేసే 87 విమానాలను రద్దు చేశారు. ఇంకా ఆ ప్రదేశంలో ఏమైనా పురాతన బాంబులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ కూడా సాగుతోందని చైనా వార్తా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

మియాజాకీ ఎయిర్ పోర్టు జపాన్ లో చాలా బిజీ ఎయిర్ పోర్టు. టోక్యో, ఒసాకా, ఫుకుయోకా లాంటి నగరాలకు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు చేసే విమానాల సంఖ్య ఎక్కువ. ఎయిర్ పోర్టులో డ్యామేజ్ అయిన రన్ వే త్వరగా రిపేర్లకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మియాజాకీ ఎయిర్ పోర్ట్ ని మిలిటరీ కోసం కాకుండా పౌర విమానాయానం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ ఎయిర్ పోర్ట్ లో 2500 మీటర్ల రన్ వే ఉండగా ఒక టెర్మినల్ మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. తైవాన్, దక్షిణ కొరియా దేశాలకు ఎక్కువగా అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు చేస్తున్నాయి.

79 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో అమెరికా మియాజాకీ ఎయిర్ పోర్టు పరసరాల్లో వేల సంఖ్యలో బాంబులు కురిపించింది. కేవలం 2023లోనే 2,348 బాంబులను జపాన్ రక్షణ సిబ్బంది డిఫ్యూజ్ చేసింది. ఆ బాంబుల బరువు 37.5 టన్నులు ఉంటుందని సమాచారం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×