E-Paper
Advertisement

వారందరినీ తీసుకొస్తా.. తేదీ- సమయం చెప్పండి, రామచంద్రరావుకు పొన్నం సవాల్

వారందరినీ తీసుకొస్తా.. తేదీ- సమయం చెప్పండి,  రామచంద్రరావుకు పొన్నం సవాల్
Advertisement

Hyderabad City: దేశవ్యాప్తంగా ‘సర్’ వ్యవహారంపై చర్చ తీవ్రమవుతోంది. ఇదే సమయంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన వారందరినీ తీసుకొస్తానని, తేదీ-సమయం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్‌కు మంత్రి పొన్నం సవాల్

ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్న ప్రభాకర్..  సర్ వ్యవహారంపై బీజేపీ నేతల మాటలపై మండిపడ్డారు. ఓటు హక్కు కోల్పోయిన వారందరినీ తీసుకొస్తానని, తేదీ-సమయం చెప్పాలన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల తొలగింపుపై కూడా సమాధానం చెప్పాలన్నారు. ఓటు బచావో-దేశ్ బచావో- ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణలో ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుందామని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిస్తే  ప్రజాస్వామ్యానికి మేలు జరిగేదన్నారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనలను తప్పుబట్టడం మంచిది కాదన్నారు.

తేదీ-సమయం చెబితే.. వారందరినీ తీసుకొస్తా-మంత్రి పొన్నం

Advertisement

ఓటు హక్కు కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించడం సరికాదన్నారు మంత్రి. ఆందోళన చేస్తున్నవారిని పోలీసుల చేత అరెస్టులు చేయించడం తగదన్నారు. ఓటు హక్కు కోల్పోయామని ఆందోళన చెందుతున్న బాధితులను మీ ముందుకు తీసుకొస్తానన్నారు. మా సవాల్‌ను స్వీకరించి తేదీ, సమయం నిర్ణయించాలన్నారు. ఎన్నికల సంఘం రికార్డులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులపై ఎన్నికల రికార్డులను పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. నా ఓటుతోపాటు తండ్రి పేరులో వ్యత్యాసాలను సాకుగా చూపి ఓటు తొలగించే ప్రయత్నం జరిగిందన్నారు.

ALSO READ: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు

Advertisement

అర్హులైన వారి ఓట్లను తొలగిస్తే వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు మంత్రి పొన్నం. దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు పోయాయని, హైదరాబాద్ లో 40 లక్షల మంది తమ తమ ఓటు హక్కు కోల్పోయారని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సవరణ పేరుతో తొలగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ఓట్లు తొలగించారు? వాటిలో అనర్హులైనవారి ఓట్లు ఎన్ని? అర్హులైనవారి ఓట్లు పొరపాటున తొలగించబడ్డాయా? అనే అంశాలపై స్పష్టమైన వివరాలు వెల్లడించాలన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓట్లు తొలగించారని విమర్శించారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమన్నారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

Related News

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు

గద్వాల మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్రిక్తత.. కమిషనర్ విధులకు ఆటంకం!

ప్రభుత్వ హెల్త్ కార్డ్ పథకంపై వివాదం.. సర్కార్‌కు తప్పని తిప్పలు!

బొల్లారంలో షాకింగ్ ఘటన.. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన సెక్యూరిటీ, అసలు మేటరేంటి?

మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. మూగ, చెవిటి చిన్నారికి పునర్జన్మ!

కరెంట్ కొందామన్నా దొరకట్లేదు! ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర హెచ్చరిక!

మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం.. బావిలో దూకి తల్లీ, పిల్లలు ఆత్మహత్య!

Big Stories

Advertisement
×