BigTV English

Minister Ponnam: కొత్త రేషన్ కార్డులు.. ఆపై మంత్రి పొన్నం క్లారిటీ

Minister Ponnam: కొత్త రేషన్ కార్డులు.. ఆపై మంత్రి పొన్నం క్లారిటీ

Minister Ponnam: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సర్వే జోరుగా సాగుతోంది. జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి ఇంటింటికి వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. లబ్దిదారుల వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేస్తున్నారు.


ఈనెల 20లోపు సర్వే పూర్తి చేసి లబ్దిదారులకు లిస్టు రెడీ చేయనున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులున్నాయన్నారు.

గడిచిన పదేళ్లు రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారు, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త ఇది. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదన్నారు. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దని సూచన చేశారు.


కుల సర్వే ఆధారంగా అప్లికేషన్‌ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తాయన్నారు. పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలన్నారు.

ALSO READ:  షేక్‌పేట్‌లో అగ్నిప్రమాదం.. ఎలా జరిగింది?

ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి పొన్నం. రైతు భరోసా 12 వేలు ఇస్తున్నామని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. భూమి లేని రైతు కూలీలకు 12 వేలు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం కచ్చితంగా ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో మీడియాతో మాట్లాడారు సదరు మంత్రి.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×