Sankranthi Movies: సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అందుకే ప్రతీ సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా కూడా మరొక సినిమాకు ఎప్పుడూ చోటు ఉంటుంది. ప్రేక్షకులు కూడా చాలావరకు సంక్రాంతికి విడుదలయ్యే ప్రతీ సినిమాకు న్యాయం చేయాలనే అనుకుంటారు. అలా చాలావరకు ఈ పండగకు విడుదలయిన ప్రతీ మూవీ హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక 2025లో సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారు అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక గత 24 గంటల్లో బుక్ మై షోలో జరిగిన టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే ముందంజలో దూసుకుపోతోందని స్పష్టంగా అర్థమవుతోంది.
సంక్రాంతి సినిమా
అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో సినిమా వచ్చిందంటే సూపర్ డూపర్ హిట్ అని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోయారు. అలా ఒక పాజిటివ్ ఫీల్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ సినిమాకు రివ్యూలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా చాలా ఫ్యామిలీస్ దీనిని చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. అందుకే గత 24 గంటల్లో బుక్ మై షోలో ఈ సినిమా కోసం 349.2K టికెట్లు బుక్ అయ్యాయి. ఇది చూసి సంక్రాంతి విన్నర్ ఈ మూవీనే అని వెంకీ మామ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. టికెట్ బుకింగ్ రేసులో రెండో స్థానంలో విశాల్ హీరోగా నటించిన ‘మద గజ రాజా’ ఉండడం విశేషం.
ఆశ్చర్యపరిచిన విశాల్
విశాల్ హీరోగా సుందర్ సీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మద గజ రాజా’ మూవీ 11 ఏళ్లుగా రిలీజ్ అవ్వలేకపోయింది. ఇంతకాలం తర్వాత ఫైనల్‌గా ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. కామెడీ మూవీ కావడంతో చాలామంది ప్రేక్షకులు ‘మద గజ రాజా’ను చూడడానికి ఇష్టపడుతున్నారు. అలా గత 24 గంటల్లో బుక్ మై షోలో ఈ మూవీకి 105.74K బుకింగ్స్ జరిగాయి. ఇక దీని తర్వాతి స్థానంలో బాలయ్య మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్ ‘డాకు మహారాజ్’ నిలిచింది. గత 24 గంటల్లో ‘డాకు మహారాజ్’ సినిమాకు బుక్ మై షోలో 74.78K వచ్చాయి. ‘మద గజ రాజా’ మూవీ ‘డాకు మహారాజ్’ను బుకింగ్స్ విషయంలో బీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ ఓవరాక్షన్.. కేసు నమోదు చేసిన పోలీసులు..
పుష్పగాడి హవా
‘డాకు మహారాజ్’ తర్వాతి స్థానంలో టికెట్ బుకింగ్స్ విషయంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఉంది. చాలామంది ఈ సినిమా యావరేజ్‌గా ఉందని నిజాయితీగా రివ్యూలు ఇస్తున్నా మరికొందరు మాత్రం ఈ సినిమాకు కావాలని నెగిటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నారు. అయినా కూడా గత 24 గంటల్లో బుక్ మై షోలో ఈ మూవీకి 44.95K బుక్ అయ్యాయి. ‘గేమ్ ఛేంజర్’ తరువాతి స్థానంలో మలయాళం మూవీ అయిన ‘రేఖాచిత్రం’ ఉంది. గత 24 గంటల్లో ఈ సినిమాకు 32.02K బుకింగ్స్ వచ్చాయి. ఇక చివరి స్థానంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ 2’ ఉంది. గత 24 గంటల్లో 18.8K బుకింగ్స్‌తో ఇప్పటికీ ఈ మూవీ సత్తా చాటుకుంటోంది.