Srikanth:నటుడిగా శ్రీకాంత్(Srikanth)ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు శ్రీకాంత్ సినిమాలు వస్తున్నాయి అంటే చాలామంది కుటుంబ కథా ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు వెళ్లేవారు. అలా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యారు. ముఖ్యంగా ఈయన నటించిన ఊయల,ఆహ్వానం, తాజ్ మహల్,ఆమె, పెళ్లి సందడి, తాళి,ప్రేయసి రావే,ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు వంటి సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.. ఈ సినిమాల ద్వారానే శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అయితే హీరో కంటే ముందు శ్రీకాంత్ కొన్ని సినిమాల్లో నెగిటివ్ పాత్రలు కూడా నటించారు. అలా స్టార్ హీరోల సినిమాల్లో శ్రీకాంత్ నెగిటివ్ రోల్స్ చేశారు. అంతేకాకుండా మల్టీ స్టారర్ సినిమాలకు శ్రీకాంత్ పెట్టింది పేరుగా ఉండేవారు. ఎందుకంటే ఈయన చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు కూడా..
ఆ సినిమాతోనే ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ..
అయితే అలాంటి శ్రీకాంత్ సినీ హీరోయిన్ అయినటువంటి ఊహని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆమె, ఆయనగారు, కూతురు వంటి సినిమాల్లో నటించే సమయంలోనే ప్రేమలో పడ్డారు. అయితే ముఖ్యంగా వీరి ప్రేమ పెళ్లికి బీజం వేసింది ‘ఆమె’ సినిమా అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా తర్వాత వీరి పెళ్లి జరిగింది. అయితే ఊహను ప్రేమించిన శ్రీకాంత్.. ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళతో పెద్ద యుద్ధమే చేసారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో ఊహ ఇంట్లో వాళ్ళు శ్రీకాంత్ తో పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ తర్వాత అన్నీ చక్కబడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయ్యాక ఇండస్ట్రీకి దూరమైన ఊహ..
ఇక పెళ్లయ్యాక ఊహ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) భార్య నమ్రత (Namrata) ఎలాగైతే సినిమాలకు దూరంగా ఉందో అప్పట్లో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకున్న ఊహ కూడా సినిమాలకు అలాగే దూరమైంది. అయితే ఈ విషయంలో శ్రీకాంత్.. తన భార్యను ఇబ్బంది పెట్టి సినిమాలకు దూరంగా ఉండమని రిస్ట్రిక్షన్స్ పెట్టలేదట. కానీ ఊహనే ఫ్యామిలీ లైఫ్ బాగుందని, సినిమాలను పక్కన పెట్టేసిందట.
ఊహ రీయంట్రీ పై శ్రీకాంత్ షాపింగ్ కామెంట్స్..
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భార్య రీ ఎంట్రీపై శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఊహ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆమెకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ప్రస్తుతం ఊహకి ఫ్యామిలీ లైఫే బాగుందని చెబుతుంది. ఏదైనా ఇంటర్వ్యూలకు రమ్మంటేనే రాదు. మొన్న ఆ మధ్యకాలంలో మా పెద్దబ్బాయి ఫస్ట్ మూవీ ప్రమోషన్స్ కోసమని మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొంది. అంతేకానీ ఆమె ఇంటర్వ్యూలకు రావడానికి కూడా ఇష్టపడదు. బలవంతంగా వస్తుంది. ఊహకి ప్రస్తుతం నటనపై ఇంట్రెస్ట్ అంతగా లేదు. అందుకే ఆమె సినిమాల్లోకి మళ్ళీ రావాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఇల్లు, ఫ్యామిలీ,పిల్లలు అంటూ చాలా హ్యాపీగా గడుపుతోంది. అందుకే ఆమెకు నటనపై ఇంట్రెస్ట్ లేదు అంటూ భార్య రీ ఎంట్రీ పై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక శ్రీకాంత్ కి హీరోగా అవకాశాలు తగ్గాక.. స్టార్ హీరోల సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో పాటు కీ రోల్స్ లో చేస్తున్నారు. అలా రీసెంట్ గా ఎన్టీఆర్ (NTR ) ‘దేవర’, రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ సినిమాల్లో చేశారు.