BigTV English

Ponnam Prabhakar meets KCR: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి పొన్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం

Ponnam Prabhakar meets KCR: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి పొన్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానం

Ponnam Prabhakar- KCR: డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణ ఏర్పాటుకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలను పంపిస్తున్నది. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్, ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ని కలిసి ఆహ్వాన పత్రాలను అందించారు. ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరారు.


ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన పొన్నం

తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ కు వెళ్లిన పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ను కలిశారు. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఈ వేడుకలో పాల్గొనాలని కేసీఆర్‌కు మంత్రి పొన్నం రిక్వెస్ట్ చేశారు. కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రి పొన్నంతో పాటు  ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు ఉన్నారు.


కేసీఆర్ నిర్ణయంపై సస్పెన్స్!

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణకు రావాలని అధికారికంగా ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆయన వస్తారా? లేదా? అనేది ఉత్కంఠత రేపుతున్నది. త్వరలోనే ఆయన నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది మేధావులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విగ్రహాన్ని తయారు చేయించారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని మార్చి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల పలువురు మేధావులు, విద్యావంతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సైతం తాజా విగ్రహంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వస్తారా? రారా? అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్

అటు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ విగ్రహంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలంటూ జూలూరి గౌరీ శంకర్ పిటిషన్ వేశారు.  విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా ఆయన పిటిషన్‌ లో అభిప్రాయపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? అంటూ విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మార్చడం మంచి పోకడకాదన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఫోటోలు విడుదల

డిసెంబర్‌ 9న ఆవిష్కరణకు రెడీ అవుతున్న విగ్రహం ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న కంకులు ఉన్నాయి.  చెవులకు కమ్మలతో ఉంది. పిడికిళ్లు ఎత్తిన పీఠంపై నిలబడి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది.

Read Also: తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×