Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. సినిమాల్లో సైతం కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. కీలక పాత్రలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇంకోపక్క ఐటెంసాంగ్స్ తో కూడా అమ్మడు అభిమానులను అలరిస్తూ వస్తుంది.
అనసూయ జబర్దస్త్ కంటే.. సోషల్ మీడియాలో వివాదాల వలన మరింత ఫేమస్ అయ్యింది. మొదట ఆంటీ వివాదంతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అనసూయ ఏ ఫోటో పెట్టినా.. నెటిజన్స్ అనసూయ ఆంటీ అంటూ కామెంట్స్ పెట్టడంతో.. ఆమె వారిపై మండిపడింది. తనకన్న చిన్నవారు.. పెద్దవారు కూడా తనను ఆంటీ అనడం ఏంటి.. ? అంటూ ఫైర్ అయ్యింది. అలా తనను ఆంటీ అనేవారిపై కేసు కూడా పెట్టింది. ఈ వివాదంతో అనసూయ బాగా వైరల్ అయ్యింది.
Deepika Padukone: స్టార్ సింగర్‌కు కన్నడ నేర్పిన దీపికా పదుకొనె.. స్టేజ్‌పైనే అతడితో కలిసి రచ్చ
ఇక దీని తరువాత విజయ్ దేవరకొండతో వివాదం పెట్టుకుంది. అర్జున్ రెడ్డి నుంచి వీరి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఎప్పుడు విజయ్ సినిమా రిలీజ్ అవుతుందో అప్పుడు అనసూయ.. అతనిని ఏదో ఒకటి అనడం, విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం.. వెంటనే అనుసూయ సైలెంట్ అవ్వడం.. గత కొన్నేళ్లుగా ఇదే నడుస్జ్టు వస్తుంది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అప్పుడు కూడా అనసూయ.. విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టడంపై ఒక ట్వీట్ చేసింది. అది ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెల్సిందే.
ఇక ది వివాదాన్ని మాత్రం విజయ్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అనసూయను బాగా ట్రోల్ చేశారు. దీంతో.. విజయ్ గొడవకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది. ఎప్పుడు తన మనసుకు ఏది అనిపిస్తే అది నిర్మొహమాటముగా సోషల్ మీడియాలో చెప్పే అనసూయ.. తాజాగా పుష్ప 2 ట్రోల్స్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటించింది.
దాక్షాయణిగా పుష్ప సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే మొదటి పార్ట్ లో అనసూయ పాత్ర నిడివి చాలా తక్కువ. పార్ట్ 2 లో ఆమె ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యనే పుష్ప 2 రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా అనసూయ అంత ఎక్కువ కనిపించింది లేదు. అంతేకాకుండా పుష్ప 2 లో అసలు కథనే లేదని.. పార్ట్ 1 కి పార్ట్ 2 కు పొంతన లేదని కొంతమంది పెదవివిరుస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై అనసూయ స్పందించింది. ట్విట్టర్ వేదికగా.. తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకొచ్చింది.
” జస్ట్ నా ఒపీనియన్.. సీక్వెల్ అంటే ఒక కథకి కొనసాగింపు అని కదా అర్ధం.. మరి ఆ పార్ట్ తో ఈ పార్ట్ ని కంపేర్ చెయ్యటం ఎంత వరకు సబబు అంటారు.ఒక ఫ్లో లో కదా చూడాలి తర్వాత ఏం జరిగింది అని” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కరెక్టే! ఆ మొదటి పార్టునే ఇంకొక పావుగంట తీసుంటే రెండో పార్టు అవసరమే ఉండేది కాదు అని కొందరు.. కంపేర్ చేయడం లేదు.. కానీ, ఇందులో కథ ఉండాలి కదా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.
Just IMO.. sequel ante oka katha ki continuity ani kada ardham.. mari a part to ee part ni compare cheyatam yenta varaku sababu antaru 🧐🤔 oka flow lo kada chudali tarvata en jarigindi ani.. 🧐
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 6, 2024