BigTV English

Minister Seethakka: మేడారంకు 1.35 కోట్ల మంది భక్తులు.. రూ.100 కోట్ల నిధులతో వసతులు..

Minister Seethakka: మేడారంకు 1.35 కోట్ల మంది భక్తులు.. రూ.100 కోట్ల నిధులతో వసతులు..

Minister Seethakka


Minister Seethakka: మేడారం జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని చెప్పారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు.

20శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పని చేశారని మంత్రి సీతక్క అన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తమ వంతుగా కృషి చేశామన్నారు. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6వేల బస్సులను కేటాయించిందన్నారు. 12వేల ట్రిప్పులు నడిపిందని ఆమె వెల్లడించారు. మహాజాతరకు వచ్చిన భక్తుల్లో 5090మంది తప్పి పోయారని తెలిపారు. వారిలో 5062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారన్నారు. వారిని వారి కుటుంబాలకు క్షేమంగా అప్పగిస్తామని తెలిపారు.


Read More:తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం.. స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డి..

తప్పిపోయిన వారి వివరాల కోసం మీడియా పాయింట్, జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన మిస్సింగ్ పాయింట్ లో సంప్రదించాలని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం సం నుంచి మేడారంలో పది రోజుల పాటు పారిశుద్ద్య పనులు జరుగుతాయని వెల్లడించారు. ఇందు కోసం దాదాపు 4 వేల మంది కార్మికులను నియమించినట్లు మంత్రి వెల్లడించారు.

 

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×