E-Paper
Advertisement

Israel-Iran war: ఇరాన్ ‘రెడ్ లైన్’ దాటితే.. ఇజ్రాయెల్ ‘డెడ్ లైన్’ ఖాయం!

Israel-Iran war: ఇరాన్ ‘రెడ్ లైన్’ దాటితే.. ఇజ్రాయెల్ ‘డెడ్ లైన్’ ఖాయం!

Israel-Iran war: అవును ఇజ్రాయెల్ ఇప్పుడు హైఓల్టేజ్ లో కనిపిస్తోంది. అమెరికా కలిసి వస్తుందా సరే.. లేదంటే సింగిల్ గానైనా సరే రణరంగంలోకి దిగుతామని క్లారిటీ ఇచ్చేసింది. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో ఇజ్రాయెల్ సూచించిన రెడ్ లైన్ దాటితే, అమెరికా హెల్ప్ లేకపోయినా ఒంటరిగానైనా ఇరాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు డైరెక్ట్ సిగ్నల్స్ పంపారు. అమెరికా కోసం వెయిటింగ్ ఉండబోదని క్లారిటీ ఇచ్చేశారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్స్ తమ దేశ ఉనికికే ప్రమాదమని అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అమెరికాకు చెప్పేసింది.

ఇరాన్ మిసైల్ కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ యాక్షన్ ప్లాన్ రెడీ?

అంతే కాదు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కేవలం అణు కార్యక్రమానికి పరిమితం కాకూడదని, ఇరాన్ మిసైల్స్ రేంజ్ తగ్గించడం, వాటి తయారీపై ఆంక్షలు విధించడం వంటి అంశాలనూ చేర్చాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే ఇరాన్ చర్చల పేరుతో టైం పాస్ చేస్తూ తన మిసైల్ కెపాసిటీ పెంచుకుంటోందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే… క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేసే యాక్షన్ ప్లాన్ ను కూడా ఇజ్రాయెల్ రెడీ చేసి పెట్టుకుంది. ఇదే విషయంపై చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవబోతున్నారంటున్నారు. అమెరికా ఇరాన్ చర్చలు కేవలం అణు ఒప్పందానికి మాత్రమే పరిమితం కావద్దని ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చే ఆలోచనతో ఉన్నారాయన.

ఇరాన్ మ్యాప్ లో రెడ్ డాట్స్.. అణు కేంద్రాలే లక్ష్యం

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కవ్వింపులు పెరుగుతుండడంతో ఈ వ్యవహారం మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్. ఇరాన్ తన అధికారిక మీడియాలో, సైనిక ప్రదర్శనల్లో ఇజ్రాయెల్ మ్యాప్‌ను చూపిస్తూ, అందులో టెల్ అవీవ్, హైఫా, అణుకేంద్రం ఉన్న డిమోనా వంటి నగరాలను రెడ్ డాట్స్ టార్గెట్స్ గా చూపింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఎటాక్ చేస్తే…, తాము ఇజ్రాయెల్ లోని ప్రతి అంగుళాన్ని మిసైల్స్ తో లేపేస్తామన్నది ఇరాన్ సిగ్నల్స్. ఇజ్రాయెల్ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఇరాన్ మొదటగా వార్ గేమ్ మొదలు పెట్టింది. సో మొదటగా మైండ్ గేమ్ తో మొదలై కథ మరింత ముదురుతుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్.

ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసే ఇరాన్ మిసైల్

ఇరాన్ దగ్గర ప్రస్తుతం 2 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఖైబర్ షెకాన్ క్షిపణి అయితే ఇరాన్ నుంచి నేరుగా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తుంది. అలాగే సెజ్జిల్, షాహాబ్-3 ఇవి మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని టార్గెట్ చేసే కెపాసిటీతో ఉన్నాయి. ఇటీవల ఇరాన్ తన హైపర్ సోనిక్ మిసైల్ ఫతాను కూడా డిస్ ప్లే చేసింది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఆరో వంటి రక్షణ వ్యవస్థలను కూడా టార్గెట్ చేస్తుందని ఇరాన్ చెబుతోంది.

ఇరాన్ ఇజ్రాయెల్‌కి వార్ సిగ్నల్

ఇరాన్ ఈ స్థాయిలో రెచ్చిపోతే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా.. ఇరాన్ ప్రదర్శించిన టార్గెటెడ్ మ్యాప్ లను నెతెన్యాహు సీరియస్ గా తీసుకున్నారు. వీటిని ఏదో ప్రచారంగా చూడట్లేదు. నిజానికి ఇరాన్ తన మిసైల్స్ పై…, ఇజ్రాయెల్ ను భూమి మీద నుంచి ఎలిమినేట్ చేయాలన్న స్లోగన్స్ రాస్తోంది. ఇది తమ దేశానికి డేంజర్ బెల్ అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ కేవలం మిసైల్సే కాకుండా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న హిజ్బుల్లా, హౌతీలకు డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేస్తూ కౌంటర్ చేసే ప్లాన్ లో ఉంది. సో ఇదొక వార్ సిగ్నల్ గా మారింది. ఇప్పుడు ఏ చిన్న స్పార్క్ వచ్చినా వార్ జోన్ గా మారిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో అమెరికా చెప్పినా సరే ఇజ్రాయెల్ ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు. పరిస్థితి చేయి దాటి పోతోంది. ఏ క్షణమైనా అన్నట్లుగా వార్ గేమ్ మారబోతోంది.

శత్రువు దాడి చేసేలోపే దెబ్బ.. ఇజ్రాయెల్ కొత్త డాక్ట్రిన్

ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ మల్టీ లేయర్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు.. దౌత్యం, సాంకేతికం, గూఢచర్యం అన్నీ కలగలిపి జాయింట్ గా అప్లై చేస్తోంది. శత్రువు దాడి చేసే వరకు వెయిటింగ్ ఉండదు…, సింహంలా గర్జించి వారిని వారి స్థావరాల్లోనే దెబ్బతీస్తాం అన్నది ఇజ్రాయెల్ మాట. ఇరాన్ మళ్లీ ఎటాకింగ్ ప్లాన్ చేస్తే గతంలో కంటే బలమైన రైజింగ్ లయన్ ఆన్ స్టెరాయిడ్స్ అన్న ఆపరేషన్ చేపడతామని ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ రైజింగ్ లయన్ తో ఇరాన్ గట్టి దెబ్బ తీసింది. ఇప్పుడు అంతకు మించిన ఆపరేషన్ అంటే వార్ గేమ్ ఎలా ఉండబోతోందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇజ్రాయెల్ దెబ్బ అలా ఉంటుంది.

తక్కువ ఖర్చుతో సురక్షిత సమాధానం

ఒకవేళ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఆరో 2, ఆరో 3 రక్షణ కవచాలను ఆపరేట్ చేయబోతోంది. ఆకాశంలోనే ఆ మిసైల్స్ ను అడ్డుకునేలా రెడీగా ఉంది. మధ్యస్థ శ్రేణి క్షిపణులు డ్రోన్లను అడ్డుకుంటుంది. స్వల్ప శ్రేణి రాకెట్లను అడ్డుకోవడానికి ఐరన్ డోమ్ పని చేయనుంది. ఇక ఇజ్రాయెల్ కు ఐరన్ బీమ్ అంటే లేజర్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సిస్టమ్ తో లేజర్ కిరణాలతో డ్రోన్లను, మిసైల్స్ ను అతి తక్కువ ఖర్చుతో ధ్వంసం చేస్తుంది.

ఇరాన్ అణు కేంద్రాలపై సైబర్ దాడులు?

ఇక రెండోది ఆపరేషన్ షాడో. ఇరాన్ లోపలే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇప్పటికీ సీక్రెట్ గా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వీళ్లను పట్టుకోవడం ఇరాన్ వల్ల కావట్లేదు. ఇరాన్ అణు కేంద్రాల సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసి సెంట్రిఫ్యూజ్‌లను నాశనం చేసే ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇజ్రాయెల్ కేవలం ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులతో అంటే హిజ్బుల్లా, హమాస్ అక్టోపస్ కాళ్లతో మాత్రమే పోరాడేది. కానీ ఇప్పుడు నేరుగా అక్టోపస్ తల అంటే ఇరాన్ పైనే ఎటాక్ చేయడం. ఇరాన్ లోపల ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై నేరుగా దాడులు చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. అంతే కాదు ఇరాన్‌ను ఎదుర్కోవడంలో సపోర్ట్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలతో సంబంధాలను బలపరుచుకోనుంది.

వందల టార్గెట్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

నిజానికి 2025, జూన్ 13న ఇరాన్ పై ఆపరేషన్ రిజైంగ్ లయన్ అమలు చేసింది ఇజ్రాయెల్. ఆ యుద్ధ తంత్రంలో ఇజ్రాయెల్ దే పైచేయి అయింది. ఇజ్రాయెస్ సీక్రెట్ ఏజెంట్స్ చేసిన పని ఇరాన్ ను షాకింగ్ కు గురి చేసింది. ఇరాన్ అణుబాంబు తయారీకి చేరువలో ఉందని, దాంతో తమ ఉనికికే ముప్పు ఉందని ఇజ్రాయెల్ ముందస్తు దాడి చేసింది. నాడు ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలతో ఇరాన్ లోని దాదాపు 900 టార్గెట్ పై ఎటాక్ చేసింది. ఇరాన్ వద్ద ఉన్న దాదాపు 50% బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను, 200లకు పైగా క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఆ ఆపరేషన్ లో చాలా మంది కమాండర్లను, న్యూక్లియర్ సైంటిస్టులను లేపేసింది ఇజ్రాయెల్.

Also Read:హాలీవుడ్ రేంజ్ హంగామా.. చైనా ‘స్పేస్ క్యారియర్’ ప్రపంచ దేశాలకు హెచ్చరికా.. లేక మైండ్ గేమా?

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×