E-Paper
Advertisement

Velugumatla land patta distribution: వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రుల బృందం!

Velugumatla land patta distribution: వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రుల బృందం!
Advertisement

Velugumatla land patta distribution: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది. గుడిసెలు కోల్పోయిన పేద నిర్వాసితుల్లో అర్హులైన వారిని గుర్తించిన ప్రభుత్వం వారికి అదే చోట నివసించేలా హక్కు పత్రాలను పంపిణీ చేసింది. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 412 మంది అర్హులకు పట్టాలు అందజేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రుల బృందం స్పష్టం చేసింది. వెలుగుమట్ల ప్రాంతంలో 311 మందికి స్థలంతో పాటు ఇల్లు ఇస్తుండగా మిగిలిన 101 మందికి వారి స్వస్థలాల్లోనే ఇంటి నిర్మాణానికి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెలుగుమట్ల పేదల వద్ద ఒక సమాంతర మాఫియా ముఠా చేరి వేల రూపాయలు దోచుకుందని మండిపడ్డారు. సరైన వసతులు కల్పించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ మాఫియాను వెళ్లగొట్టేందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపే వెలుగుమట్లలో భూమి పూజ నిర్వహిస్తామని.. డిసెంబర్ 9వ తేదీ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని బాధితులు పాల పొంగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బాధితులు ఎటువంటి భయం లేకుండా ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ కమిట్ మెంట్ అని పునరుద్ఘాటించారు.

Advertisement

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇళ్లపై చిత్తశుద్ధి లేని వారు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఏడున్నరేళ్లుగా ఇక్కడ ఉంటున్న పేదలకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. ఇది పేదోడి ప్రభుత్వమని.. ఇక్కడ నివాసాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, మౌలిక వసతులు కూడా ప్రభుత్వం కట్టిస్తుందని హామీ ఇచ్చారు. పేదవాడి సొమ్మును దోచుకున్న వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెలుగుమట్లలో ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక ముఠాగా ఏర్పడి పేదల రెక్కల కష్టాన్ని దోచుకున్న దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ భూమి ప్రస్తుతం సీసీఎల్ పరిధిలోకి వచ్చిందని.. అందుకే అర్హులను గుర్తించి నేరుగా ప్రభుత్వం ద్వారా ఇళ్లు అందజేస్తున్నామని తెలిపారు. వెలుగుమట్ల కాలనీలో పేద పిల్లల చదువు కోసం మోడల్ స్కూల్, కమ్యూనిటీ హాల్ వంటి వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్ది పేదల కుటుంబాల్లో సంతోషం నింపుతామని ఆయన ప్రకటించారు. మాఫియా శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని బాధితులకు సూచించారు.

Advertisement

Read Also: Water Pollution: బంధం కుంట చెరువులో డేంజర్ బెల్స్.. ఇరిగేషన్, మున్సిపల్ శాఖపై స్థానికులు ఆగ్రహం

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×