BigTV English

Minor Girl Rape Case: 16 ఏళ్ల బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

Minor Girl Rape Case: 16 ఏళ్ల బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

Minor Girl Rape Case


Minor Girl Rape Case(crime news today): ప్రజల మాన, ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి సభ్య సమాజం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ఒక ఉద్యోగంలో ఉన్న విషయం, విచక్షణ మరిచి 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లి సీఐగా ఉన్న బండారి సంపత్ 2022 లో కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేశాడు. అప్పటి నుండి హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో సన్నిహితంగా మెలిగాడు. సీఐగా ఖమ్మం జిల్లాకు బదిలీ అయిన తర్వాత కూడా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది.


Also Read: పడగ విప్పిన శ్వేతనాగు.. వీడియో చూస్తే ఒళ్లు షేక్!

ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సీఐగా బదిలీపై వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు సాన్నిహిత్యంగా ఉన్న మహిళ కూతురు(16)పై కన్నేసిన అతడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పింది. మైనర్ అయిన తన కుమార్తెపై పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడినట్లుగా కేయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధ్యతాయుతమైన అధికారిగా ఉండి ఇలా నీఛమైన పనులకు పాల్పడిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Tags

Related News

Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Mehdipatnam accident: మెహదీపట్నం బస్టాప్‌లో RTC బస్సుకు మంటలు.. క్షణాల్లో బూడిద!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Mancherial Teacher: వెరైటీగా క్లాస్ కు వచ్చిన టీచర్.. విద్యార్థులు షాక్.. ఎక్కడంటే?

Big Stories

×