BigTV English

Rara White King Cobra: పడగ విప్పిన శ్వేతనాగు.. వీడియో చూస్తే ఒళ్లు షేక్ అవ్వాల్సిందే!

Rara White King Cobra: పడగ విప్పిన శ్వేతనాగు.. వీడియో చూస్తే ఒళ్లు షేక్ అవ్వాల్సిందే!
Cobra Viral Video
Cobra Viral Video

Rare White Kind Cobra Video: సోషల్ మీడియా నిత్యం ప్రజల్ని ఆశ్యర్యపరుస్తూనే ఉంటుంది. ఇందులో ప్రతి రోజూ ఎన్నో వింతైన, వికృతైన, ఫన్నీ, ఆశ్యర్యానికి గురిచేసే ఫోటోలు, వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X, Instagram, Facebookలో ఎల్లప్పుడూ వైరల్ అవుతుంటాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా ఓ పాముకు సంబంధింత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా మాములు పాము కాదు..శ్వేతనాగు. దీని పూర్తి వివరాలు చూసేయండి.


ప్రస్తుతానికి వైలర్ అవుతున్న వీడియోలో కనిపించే పాము శ్వేతనాగు. ఈ పేరు వినగానే ఒక్కసారిగా అందరికి ఓళ్లు షేక్ అయి ఉంటుంది. ఈ పామును చూడగానే ఒక్కసారి తెలుగు నటి సౌందర్య జ్ఞాపకం వచ్చుంటారు. ఎందుకంటే.. అప్పుడు సౌందర్య యాక్ట్ చేసిన శ్వేతనాగు అనే చిత్రం తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్ స‌ృష్టించింది. ఈ సినిమాతోనే శ్వేతనాగు అనే ఒక పాము ఉంటుందని జనాలకు తెలిసి వచ్చింది. ఈ సినిమా టీవీల్లోకి వస్తే జనాలకు టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ సినిమాతోనే జనాలకు పాములంటే భయం మరింత పెరిగిందనే చెప్పాలి.

Also Read: బిర్యానీలో ఉంగరం.. తింటుండగా ప్రత్యక్షం.. కంగుతిన్న కస్టమర్


ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అవుతోంది. శ్వేత నాగు పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పామును చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకవుతున్నారు. వైరల్ వీడియోస్ అనే అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయింది. వందలాది వ్యూస్‌తో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read:  ఏం ఐడియా గురూ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏకంగా టీషర్ట్‌పై క్యూఆర్ పెట్టేసావ్ గా..!

వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. పాము మిల్కీ వైట్‌లో పడగవిప్పి నించొని ఉంది. ఈ దృశ్యం చూడటానికి చాలా భయంకరంగా ఉంది. పక్కనే ఓ వ్యక్తి స్టిక్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. ఏదేమైనా పాములు ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి బారిన పడ్డామంటే చంపకుండా వదలవు. పాము కాటేస్తే నిమిషాల వ్యవధిలోనే మనిషి ప్రాణాలు పోతాయి. కాబట్టి పాముల నుంచి జాగ్రత్తగా ఉండండి.

Tags

Related News

Viral Video: పొంగిపొర్లే నదిలో డేంజర్ స్టంట్, వరద ధాటికి జీప్ పల్టీ, సీన్ కట్ చేస్తే..

Viral Video: మెట్రో స్టేషన్ లో షాక్.. యెల్లో లైన్‌ దాటిన సెక్యూరిటీ.. అదే సమయంలో!

Pakistan Woman: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!

Arunachal pradesh: అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం.. వాహనాలు వెనక్కి, జస్ట్ మిస్ లేకుంటే

China Delivery Man: ఫుడ్ ఇవ్వడానికి.. మహిళ ఇంటికి వెళ్లిన డెలీవరీ మ్యాన్, ఆమె తలగడపై రక్తంతో రాసింది చూసి..

Heavy rains: వర్షం బీభత్సం.. 2 కిమీల మేర ఏర్పడిన భారీ గుంత.. వీడియో వైరల్

Big Stories

×