E-Paper
Advertisement

మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో సక్సెస్ ఫెస్ట్!

మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో సక్సెస్ ఫెస్ట్!
Advertisement

Success Fest: స్వేచ్ఛ బ్యూరో: సత్తుపల్లి పట్టణం సిద్ధారం రోడ్‌లోని మిరాకిల్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో సక్సెస్ ఫెస్ట్ (రిజల్ట్ డే) వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను సాదరంగా ఆహ్వానిస్తూ, విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే ఈ వేడుకలు పాఠశాల అభివృద్ధికి ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు, న్యూ స్టార్ హాస్పిటల్ డాక్టర్ రామాల సురేష్ హాజరయ్యారు. జూన్ నెల ప్రారంభం నుంచి ఏప్రిల్ నెల చివరి వరకు విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలు ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల పట్టుదలకు నిదర్శనమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

నక్క రాజేశ్వరరావు మాట్లాడుతూ..

అధునాతన వేదిక్ మాథ్స్, అబాకస్, ఇన్నోవేటివ్ మెథడ్స్, ఏఐ టెక్నాలజీ, ఎల్ఈడి డిజిటల్ క్లాసెస్ ద్వారా విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాఠశాల కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నగర స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్న ఈ పాఠశాల ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి అవసరమైన ఆధునిక పద్ధతులను అమలు చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థులను దారి చూపించడం కాలానుగుణమైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

Advertisement

Also read: Remedies for Wealth: మీ సంపద పెరగాలంటే ఆ రెమెడీస్ పాటించాలట.

సమగ్ర విద్యా విధానం

విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా సత్తుపల్లి పట్టణంలోని మిరాకిల్ మైండ్స్ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమమైన విద్యా బోధనల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అభినందించారు.న్యూ స్టార్ హాస్పిటల్ డాక్టర్ రామాల సురేష్ మాట్లాడుతూ విద్య అనేది కేవలం పరీక్షల ఫలితాలతో ముగిసేది కాదని, జీవితంలో విలువలను నేర్పించే ప్రక్రియ అని తెలిపారు. మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో అమలు చేస్తున్న సమగ్ర విద్యా విధానం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. చిన్న వయస్సులోనే టెక్నాలజీ, లాజికల్ థింకింగ్, మానసిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం భవిష్యత్ పోటీతత్వ ప్రపంచంలో వారికి బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ గీత, డీన్ వాణి, ఏవో మురళి, ఇంచార్జ్ మహేష్, టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

Also read: ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×