Miss World 2025: హైదరాబాద్ మహా నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించారు. 110 కిపైగా దేశాలకు చెందిన అందగత్తెలు ఈ కిరీటం కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే.
మన దేశం నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.
మిస్ వరల్డ్-2025 పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం జాతీయ గీతాలాపన#MissWorld2025 https://t.co/PZPliLDi4l pic.twitter.com/HEP3rOIOuH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 10, 2025
Also Read: Rain Alert: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. గంటకు 40కి.మీ నుంచి 50కి.మీ వేగంతో..!
మొత్తం 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన కన్నులవిందుగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్నమైన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు పాల్గొన్నారు.
Also Read: SBI Recruitment: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. జీతం రూ.48,480