OTT Movie : ఓటీటీ వచ్చిన తరువాత, పరిస్థితి చాలా మారిపోయాయి. సినిమాలను థియేటర్లకు వెళ్ళకుండా, ఇంట్లోనే ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీటిలో సీరియల్ కిల్లర్ సినిమాలు ఇంట్రెస్టింగ్ స్టోరీలతో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా వరుస హత్యలతో, ఊపిరి ఆడకుండా చేస్తుంది. చివరి వరకు హంతకుడు ఎవరో తెలీక తలలు పట్టుకుంటారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో
ఈ స్వీడిష్ హారర్ మూవీ పేరు ‘ది కాన్ఫరెన్స్’ (The Conference). 2023 లో వచ్చిన ఈ మూవీకి పాట్రిక్ ఎక్లండ్ దర్శకత్వం వహించారు. మాట్స్ స్ట్రాండ్‌బర్గ్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కటియా వింటర్, ఆడమ్ లండ్‌గ్రెన్, ఎవా మెలాండర్ నటించారు. ఈ మూవీ స్టోరీ ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఇది 2023 అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
స్వీడిష్ పట్టణంలో కొంతమంది మున్సిపాలిటీ ఉద్యోగులు, ఒక ఫార్మ్‌ల్యాండ్‌పై నిర్మిస్తున్న షాపింగ్ మాల్ ను చూడటానికి వెళతారు. ఈ ప్రాజెక్ట్ ఒక అడవి ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే భూమి సమీకరణలో, అవినీతి జరిగినట్లు ఆరోపణలు వసాయి. ఈ ఆరోపణలు ఉద్యోగుల మధ్య ఉద్రిక్తతను పెంచుతాయి. ముఖ్యంగా లీనా అనే ఉద్యోగి, తన సంతకం ఫోర్జరీ అయిందని ఆరోపిస్తుంది. కొన్ని ఒప్పందాలలో తన సంతకం ఉపయోగించబడినట్లు కనిపెడుతుంది. ఈ అవినీతిని ప్రశ్నిస్తూ ఆమె నిరసనకు దిగుతుంది. కొంతమంది ఉద్యోగులు ఈ ప్రాజెక్ట్ బిల్డింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు.
అయితే ఆ ప్రాజెక్ట్ కు మద్దతు ఇచ్చిన ఉద్యోగులను, ఒక ముసుగు ధరించిన వ్యక్తి ఒక్కొక్కరినీ క్రూరంగా హత్య చేయడం ప్రారంభిస్తాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాక సతమతమవుతుంటారు ఉద్యోగులు. నిజానికి ఈ హత్యల వెనుక ఒక రైతు కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం వల్ల, ఆ ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకుంటాడు. తన తండ్రి ఆత్మహత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే, ఆ రైతు కుమారుడు ఈ హత్యలు చేస్తుంటాడు. చివరికి ఆ రైతు కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి ? ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో కనిపెడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ స్వీడిష్ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.