మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యవహారం మరోసారి వివాదంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావుతో పాటూ.. కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్షలు చేసిన ఆయనకు సంబంధించిన మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో తానెవ్వరికీ భయపడనంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోదీ, కేసీఆర్, కేటీఆర్‌లకు భయపడనంటూ మైనంపల్లి మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. అందులో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలనని.. టీడీపీలో ఉన్నప్పుడు తాను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చానని గుర్తుచేశారు. మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చానన్న మైనంపల్లి.. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా అంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకి వివాదాలు కొత్తకాదు. ఎదుటివారెవ్వరైనా.. తాను అనాలనుకున్నది అనేసి వార్తల్లో నిలవడం మైనంపల్లికి అలవాటు. గతంలోనూ ఆయన సంచలన హెచ్చరికలతో పాటూ.. ప్రత్యక్ష చర్యలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైనంపల్లి హన్మంతరావు వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
మరోవైపు, భవిష్యత్ కార్యచరణపై తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు మైనంపల్లి. బీఆర్ఎస్‌ను వీడటమో? కొడుక్కు టికెట్ సాధించుకోవడమో? కాంగ్రెస్‌లో చేరడమో? ఏదో ఒకటి తేల్చేస్తారని అంటున్నారు.