BigTV English

National Award: స్మగ్లర్ వర్సెస్ లాయర్.. రచ్చ రచ్చ.. జైభీమ్‌కు నాని సపోర్ట్!

National Award: స్మగ్లర్ వర్సెస్ లాయర్.. రచ్చ రచ్చ.. జైభీమ్‌కు నాని సపోర్ట్!

National Award: జాతీయ సినిమా అవార్డుల ప్రకటనపై సరికొత్త వివాదం మొదలైంది. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించడంపై పెద్ద దుమారమే రేగుతోంది. అడవిలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్‌కి జాతీయ అవార్డు ఇవ్వడమేంటంటూ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దళిత బిడ్డకు న్యాయం చేసిన జై భీమ్ లాంటి సినిమాకు అవార్డ్ ఇవ్వకపోవడంపై మండిపడుతోంది.


జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు సూర్య అసలైన అర్హుడని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అడవిని దోచేసే వాడికి అవార్డ్ ఇచ్చారు కానీ.. అడవి బిడ్డకు న్యాయం చేసిన వారికి ఇవ్వరా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక, హీరో నాని తన స్టేటస్‌లో జై భీమ్ అంటూ పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆ పోస్టులో జై భీమ్ పక్కన పగిలిన గుండె సింబల్‌ను పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.


మరోవైపు.. స్మగ్లర్‌కు ఉన్న విలువ.. రాజ్యాంగం విలువ తెలిసిన లాయర్‌కు లేకపోవడం శోచనీయం అంటూ డాక్టర్ నూరి పరి.. పోస్ట్ పెట్టారు. జై భీమ్ కంటే పుష్పలో ఏం ఉందని ఆయన ప్రశ్నించారు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది జై భీమ్‌ను కాదని పుష్ప సినిమాలో స్మగ్లర్ క్యారెక్టర్‌ చేసిన అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×