E-Paper
Advertisement

MLA Vamsi krishna : శిశువు మెడకు చుట్టుకున్న పేగు.. గర్భిణికి ప్రసవం చేసిన ఎమ్మెల్యే..

MLA Vamsi krishna : నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి ప్రసవం చేశారు. లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు అధికం కావడంతో కుటుంబసభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని వైద్యులు తెలిపారు.

MLA Vamsi krishna : శిశువు మెడకు చుట్టుకున్న పేగు.. గర్భిణికి ప్రసవం చేసిన ఎమ్మెల్యే..
Advertisement

MLA Vamsi krishna : నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి ప్రసవం చేశారు. లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని వైద్యులు తెలిపారు.

ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ హైరిస్క్ కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. వైద్య ఖర్చుకి ఆర్థికస్తోమత లేదని గర్భిణి బంధువులు తెలిపారు. గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగుతుందని భయానికి గురైయ్యారు. చివరకు ఆమె కుటుంబసభ్యులు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణకు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే ఆందోళన చెందవద్దని వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

Advertisement

ఎమ్మెల్యే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. గైనకాలజిస్టు డా.స్రవంతితో, సూపరిడెంట్‌తో కలిసి గర్భిణికి సిజేరియన్‌ చేశారు. ఆడ శిశువు జన్మించింది. తల్లి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రికి స్వయంగా వచ్చి ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యే వంశీ కృష్ణకు.. ప్రసన్న కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×