E-Paper
Advertisement

MLC Dasoju Sravan: శాసన సభ ఆవరణ లో డ్రగ్స్ టెస్ట్ పెట్టించండి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

MLC Dasoju Sravan: శాసన సభ ఆవరణ లో డ్రగ్స్ టెస్ట్ పెట్టించండి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Advertisement

MLC Dasoju Sravan: గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసన సభ ఆవరణ లో డ్రగ్స్ టెస్ట్ పెట్టించండి..డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ కు మేము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌజ్ లో జరిగిన విందు లో టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ తో పాటు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని, డ్రగ్స్ దొరికాయని పోలీసులు అంటున్నారన్నారు. విచారణ జరిపి దోషులు ఎంతటి వారు ఉన్నా కఠినంగా శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Anil Kapoor: ఆ సినిమా నన్ను మిలియనీర్‌ను చేసింది.. అనిల్ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకుందా ?

Advertisement

విచారణ పారదర్శకంగా జరగాలన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ సోషల్ మీడియా కావాలని బురద జల్లుతోందని,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి లో ఉండి తన హోదా కు తగ్గట్టుగా మహేష్ కుమార్ గౌడ్ వ్యవహరించడం లేదన్నారు. కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిల్లర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకుందా ? అని ప్రశ్నించారు. చర్లపల్లి లో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నది ముంబై పోలీసులు అని, అక్కడి పోలీసులు వచ్చే దాకా ఈగల్ పోలీసులుఏమి చేశారు ? అని నిలదీశారు. 2025 లో 2572 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి ..గంజా అడ్డు అదుపు లేకుండా పెరిగి పోయిందని, మండలి లో ప్రశ్న అడిగితే 30 శాతం డ్రగ్స్ వినియోగం పెరిగిందని ప్రభుత్వం చెప్పిందన్నారు.

మహేష్ గౌడ్ ,సీఎం సిద్ధమా?

ప్రజా ప్రతినిధులందరం డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాం. మహేష్ గౌడ్ ,సీఎం సిద్ధమా ? అని కోరారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరం డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధం ..ప్రత్యేక స్టాల్స్ పెట్టండి..కే టీ ఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం లోపాలు ఎత్తి చూపుతున్నారనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ అవినీతికి అడ్డు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు కే టీ ఆర్ పై నోరు పారేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ వ్యవహారం లో కే టీ ఆర్ పై పిచ్చి ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేతలను కోర్టు కీడుస్తాం అని హెచ్చరించారు. కేసీఆర్ హయం లో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపారన్నారు. డ్రగ్స్ కు రాజకీయాలను ఆపాదించవద్దు అని సూచించారు. సమావేశంలోబీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

Advertisement

Also ReadJio Recharge Plan 2026: నెలకు రూ.82 మాత్రమే.. 11 నెలల పాటు.. ఫ్రీ కాల్స్, ఓటీటీలు, హై స్పీడ్ డేటా!

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×