E-Paper
Advertisement

MLC Kavitha: నా కొడుకుల మీద ఒట్టు.. ఏ ఒక్కడిని వదలను

MLC Kavitha: నా కొడుకుల మీద ఒట్టు.. ఏ ఒక్కడిని వదలను
Advertisement

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. తన రాజకీయ ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, బీఆర్ఎస్ పార్టీలో ఎదుర్కొన్న అనుభవాలు, అంతర్గత ప్రజాస్వామ్య లోపాలపై ఆమె మాట్లాడారు.

తాను గత సంవత్సరం సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, అయితే గత నాలుగు నెలలుగా తన రాజీనామాను ఆమోదించలేదని కవిత మండలికి తెలియజేశారు. అందుకే నేను ప్రత్యేక సమయం తీసుకుని కౌన్సిల్ ‌లో  తన గళాన్ని వినిపించాల్సి వచ్చిందన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 40 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుందని అన్నారు.

Advertisement

తనను ఎమ్మెల్సీగా చేసిన బీఆర్ఎస్ పార్టీకి, నిజామాబాద్ జిల్లా ఎంపీటీసీలు, జెడ్పిటీసీలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కట్టుబాట్లు ఎదురవుతున్నాయి కాబట్టి.. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం నైతికత కాదని రాజీనామా చేయదలుచుకున్నాని తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలిని కోరారు.

తాను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చానని కవిత తెలిపారు. 2006లో తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడే బీఆర్ఎస్ ఒక రాజకీయ శక్తిగా ఎదిగిందని, అదే ఏడాది తెలంగాణ జాగృతిని స్థాపించి యువకులు, మహిళలను ఉద్యమంలోగ్యాప్‌ను పూర్తి చేశామని వివరించారు. జాగృతి తరపున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, తెలంగాణ చరిత్రను, బతుకమ్మ పండుగను ఊరూరా తీసుకెళ్లామని కవిత చెప్పారు.

Advertisement

తెలంగాణ జాగృతి ఒక ఇండిపెండెంట్ సంస్థగా పనిచేసిందని, శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చామని తెలిపారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి కేసీఆర్ వచ్చారని, అదే స్ఫూర్తితో తానూ ఉద్యమంలోకి వచ్చానన్నారు. ఢిల్లీలో తెలంగాణ అంశం ముందుకు వెళ్లేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తూ, 2013లో సోనియా గాంధీ సన్నిహితుడు ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయడంలో తన పాత్ర ఉందన్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ జోక్యంతో తెలంగాణ సాధన ప్రక్రియ వేగం పెరిగిందని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడు ఆగుతుందో అని భయంగా ఉండేదని, బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో మెర్జ్ చేయాలన్న చర్చలు కూడా జరిగాయని తెలిపారు. కానీ 2014లో పార్టీని విలీనం చేయకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఆహ్వానం మేరకు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశానని, ఎప్పుడూ టికెట్ కోసం అతుక్కోలేదని స్పష్టం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచాయని, ప్రజలు గౌరవించి తనను ఎంపీగా చేశారని కవిత అన్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఎంపీగా తన వంతు ప్రయత్నం చేశానని, తాను ఎక్కడా తెలంగాణ బిడ్డలను, ప్రజలను వదలలేదు అన్నారు. తన వద్దకు పెద్ద కాంట్రాక్టర్లు రాలేదని, కార్మికులు, చిన్న ఉద్యోగులే వచ్చేవారని చెప్పారు.

అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేయలేదని, అవి మరింత పెరిగాయని విమర్శించారు. బీఆర్ఎస్ అంతర్గత వేదికల్లో ప్రశ్నలు అడిగితే తనపై కక్షగట్టారని, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రస్థాయి నిర్ణయాల్లో తన పాత్రను తొలగించారని, చివరకు పార్టీ నుంచి బయటకు నెట్టారని చెప్పారు.

పార్టీలో,ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చెప్పాను, అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సచివాలయం నుంచి కలెక్టరేట్ల వరకు తీరని అవినీతి జరిగిందని ఆరోపించారు. సిద్ధిపేట, సిరిసిల్లలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలు వరదల్లో మునిగిపోయాయని తెలిపారు. నేరేళ్ల ఇసుక దందా, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యం వంటి అంశాలను కూడా కవిత ప్రస్తావించారు. తనపై కుట్రలు చేసిన వారిపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా కొడుకుల మీద ఒట్టు ఏ ఒక్కడిని వదలను అంటూ ఘాటుగా స్పందించారు.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×