Kerala Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS MLC కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనక కూడా కవిత కీలక పాత్ర పోషించారని.. కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత VD సతీశన్ ఆరోపించారు. పాలక్కాడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు.. సీఎం పినరయ్ విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబి రాజేష్.. ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
కవితే స్వయంగా కేరళకు వచ్చి ఈ వ్యవహారాన్ని నడిపించారని సతీశన్ ఆరోపించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని, కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని తెలిపారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే.. మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు ఒయాసిస్ కంపెనీకి అనుమతులు లభించాయన్నారు.
ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని సతీశన్ ప్రస్తావించారు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కాడ్‌లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు. ఈ మొత్తం ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ ఆరోపించిన ఆయన.. కవిత కేరళ పర్యటనలో ఎక్కడ బస చేశారనే వివరాలపై విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
అయితే సతీశన్ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీ లక్ష్యంతో సతీశన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుగొలిపే విషయాలు..18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా
కాగా ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో .. గతేడాది మార్చి 25 న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి మార్చి 26న జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ 15న సీబీఐ అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూపు ద్వారా రూ.100 కోట్ల స్కామ్‌కు పాల్పిడినట్లు అభియోగాలు మోపారు. ఈ మేరక రౌస్ అవెన్యూ అధికారులు ఛార్జ్ షీట్ ధాఖలు చేయగా న్యాయస్థానం కవితకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
దీంతో కవిత ఐదు నెలల వరకు తీహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ ధాఖలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆగష్టు 27న మధ్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్డు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. కేరళ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని.. కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత VD సతీశన్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.