Meghana – Indraniel:ప్రముఖ బుల్లితెర నటి మేఘన (Meghana), ఆమె భర్త ప్రముఖ నటుడు ఇంద్రనీల్ (Indraniel ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ‘చక్రవాకం’ సీరియల్ లో నటించి, ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరికి పెళ్లయి చాలా సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ పిల్లలు మాత్రం పుట్టలేదు. కానీ నిత్యం మేఘనను పిల్లలు పుట్టలేదని ట్రోల్ చేసేవారు ఎక్కువే. అయితే మేఘన కూడా అందుకు తగ్గట్టుగా స్ట్రాంగ్ గా సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఇకపోతే మేఘన తనకు పిల్లలు లేరనే బాధను పక్కనపెట్టి, తన కెరియర్లో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఈమె పచ్చళ్ళ బిజినెస్ కూడా మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు వీరిద్దరూ బుల్లితెరకు దూరం అయ్యారు. అప్పుడప్పుడు పలు షోలలో కేవలం జంటగా మాత్రమే పాల్గొంటున్నారు.
నటి మేఘన ఇంట్లో భారీ పేలుడు..
అప్పుడప్పుడు కనిపించినా.. చాలా క్యూట్ గా కనిపించే ఈ జోడీకి అభిమానులు కూడా ఎక్కువే. తమ నటనతో అందరినీ అబ్బుర పరిచిన ఈమె సడన్గా తన ఇంట్లో జరిగిన భారీ పేలుడు గురించి చెప్పి భయమేస్తోంది అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న వీరు.. తాజాగా తమ ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోని కూడా తమ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. అందులో మేఘన మాట్లాడుతూ.. నేను హాల్లో కూర్చున్న సమయంలో కిచెన్ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. దాంతో ఏసీ పేలిందేమో అని నేను అన్ని గదుల్లోకి వెళ్లి చూశాను. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. ఇక చివరికి కిచెన్ లోకి వెళ్లి చూసేసరికి గ్యాస్ స్టవ్ నా కళ్ళముందే పగులుతూ కనిపించింది. దానిని నేను గత మూడేళ్ల క్రితమే తీసుకున్నాను. నేను ఆర్టిస్టును కాబట్టి ఆ స్టవ్ ముక్కలు నా ముఖానికి గుచ్చుకుంటే.. నా పరిస్థితి ఏమిటి? నా కెరియర్ అసలు ఏం కావాలి? ఇది అతి చిన్న ప్రమాదం కాదు.. దీనిపై కచ్చితంగా మేము కోర్టుకెళ్తాము.. స్టవ్ వాడాలంటేనే భయం వేస్తోంది. ఇకపై.. పాతకాలం పద్ధతి అయినా నేను స్టీల్ స్టవ్ ని ఉపయోగిస్తాను. దయచేసి వంటింట్లో ఉండేవారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సమస్య ఎంతో మందికి ఎదురవుతుంది అంటూ చెప్పుకొచ్చింది” మేఘన.
ప్రస్తుతం మేఘన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గ్యాస్ స్టవ్ పేలుడు పై ఇంద్రనీల్ కామెంట్స్..
అలాగే ఇదే వీడియోలో ఇంద్రనీల్ మాట్లాడుతూ.. మగవాళ్ళం మనం బయట ఉంటాం కాబట్టి మనకు ఆ పరిస్థితులు అర్థం కావు. దయచేసి పది షాపులు తిరిగైనా మంచి స్టవ్ తీసుకుని రండి అంటూ అందరికీ పిలుపునిచ్చారు. బ్రాండెడ్ అంటూ పోయి భారీ నష్టాన్ని చవిచూసామంటూ మేఘన వాపోతోంది. మరి ఈ బ్రాండెడ్ కంపెనీపై కేసు వేస్తానని చెబుతున్న ఈమెకు కోర్టులో ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.