Tilak Varma – Virat Kohli: తిలక్ వర్మ.. ప్రస్తుతం భారతీయ క్రికెట్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. 2024 నవంబర్ లో భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టీ-20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఈ సిరీస్ లో తిలక్ వర్మ మూడవ టి-20లో (107) సెంచరీ, నాలుగవ టి-20 లో 120 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా మొదటి టి-20 లో 19 పరుగులు, రెండవ టి-20లో 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read: Rohit Sharma: రోహిత్ దెబ్బ అదుర్స్.. ఆ ఈవెంట్ రద్దు చేసుకున్న పాకిస్తాన్ !
అనంతరం జరిగిన మూడవ టి-20లో 18 పరుగులు చేసి అవుట్ అయిన తిలక్.. రెండు డిస్మిసల్స్ మధ్య 336 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు. ఇంతకుముందు ఏ బ్యాటర్ కూడా రెండు డిస్మిసల్స్ మధ్య 300 ప్లస్ పరుగులు చేయలేకపోయాడు. ఈ పర్ఫార్మెన్స్ కారణంగా ఐసీసీ టి-20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో బుల్లెట్ స్పీడ్ తో టాప్ 2 లోకి దూసుకు వచ్చాడు. తాజాగా ఐసీసీ టి-20 బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాని విడుదల చేసింది.
ఈ క్రమంలో తిలక్ వర్మ ఏకంగా 70 స్థానాలు ఏగబాకి రెండవ స్థానంలో నిలవడం విశేషం. 2024 నవంబర్ 10న ఐసీసీ టి-20 బ్యాటర్ ర్యాంకింగ్స్ లో 72వ ర్యాంకులో ఉన్న తిలక్ వర్మ.. ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో రెండవ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 832 పాయింట్లతో ఉన్నాడు తిలక్ వర్మ. గత 80 ఇన్నింగ్స్ లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకోలేని రికార్డ్ ని, తిలక్ వర్మ అందుకున్నాడు.
గత 80 మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ సాధించలేని ఘనతని.. తిలక్ వర్మ కేవలం 11 మ్యాచ్ లలోనే సాధించాడు. ఇక ఐసీసీ విడుదల చేసిన టి-20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావీస్ హెడ్ మొదటి స్థానంలో ఉండగా.. తిలక్ వర్మ రెండవ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మూడవ స్థానంలో ఉండగా.. ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న భారత టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాలుగవ స్థానానికి పడిపోయాడు.
అలాగే భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ 9 లో నిలిచాడు. ఇక తిలక్ వర్మ 2023 ఆగస్టు 3 న వెస్టిండీస్ తో జరిగిన టి-20 మ్యాచ్ లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ సాధారణ కుటుంబానికి చెందిన తిలక్ వర్మ.. భారత జట్టులో చోటు సంపాదించడం కోసం ఎంతగానో కష్టపడ్డాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 2020 అండర్ – 19 ప్రపంచ కప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇక దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ కి ప్రతినిథ్యం వహిస్తూ.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.
Virat Kohli: Many records, but still no T20I century while batting at No. 3! 👀 🤯#TilakVarma #ViratKohli #T20I #CricketTwitter pic.twitter.com/Mg3ERrWdaX
— InsideSport (@InsideSportIND) January 30, 2025