MLC Kavitha: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం వేడెక్కింది. బీసీ రిజర్లేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం హస్తినలో నిరసనకు రెడీ అయ్యింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కవిత మరో అడుగు ముందుకేశారు. 72 గంటలపాటు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష దిగుతున్నట్లు ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కవిత. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు హైదరాబాద్ వేదికగా ఆగస్టు 4 నుంచి 6 వరకు దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. గాంధేయవాద పద్దతిలో తాము నిరసన తెలుపుతామని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం సాధన కోసం 72 గంటలు పాటు నిరాహార దీక్ష చేశానని, అప్పటి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తలొగ్గిందన్నారు. అదే పంథాలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఈ బిల్లు ఎంత అవసరమో ప్రపంచానికి తెలియ జేస్తామన్నారు.
దీక్ష కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటామని, ఇవ్వకుంటే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొంటామన్నారు. కవిత ప్రకటనపై బీఆర్ఎస్‌లో చర్చ మొదలైంది. రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కవిత బీసీల అంశాన్ని ఎత్తుకోవడాన్ని ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు.
ALSO READ: సరోగసీ ముసుగులో టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ల దారుణాలు, బిచ్చగాళ్ల నుంచి వీర్యం
ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో అలాగే చేశారని అంటున్నారు. క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ సైలెంట్‌గా ఉంటే నష్టమన్నది కొందరు నేతల వాదన.
వివిధ అంశాలపై కవిత ఇప్పుటికే పలుమార్లు దీక్ష చేపట్టారు. ఈ విషయంలో పార్టీ నుంచి ఆమెకు ఎలాంటి సహాకారం అందలేదు. జాగృతి కార్యకర్తలతో కలిసి దీక్ష చేసిన విషయం తెల్సిందే. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను గవర్నర్ పంపింది. అక్కడి నుంచి ఆర్డినెన్స్ కేంద్రానికి చేరింది.
అక్కడ దానిపై ఎలాంటి కదలిక కనిపించలేదు. ఏ మాత్రం ఆలస్యమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 5 నుంచి 7 వరకు ఢిల్లీలో నిరసనకు సిద్ధమైంది అధికార పార్టీ. ఈ అంశాన్ని ముందుగా పసిగట్టిన ఎమ్మెల్సీ కవిత, ఆగష్టు 4న నిరాహారదీక్షకు సిద్దమయ్యారు. మరి బీఆర్ఎస్ మనసులో ఏముందో చూడాలి.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 4, 5, 6వ తేదీల్లో దీక్ష చేపడతా
బీసీ బిల్లు అవసరంపై గాంధేయవాద పద్దతిలో నిరసన తెలుపుతాం
– ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు pic.twitter.com/AU1anLtUHi
— BIG TV Breaking News (@bigtvtelugu) July 29, 2025